ప్రభాస్ రూట్ మార్చాడు.. ఇక నుంచి ఏడాదికి రెండు..

ప్రభాస్ రూట్ మార్చాడు.. ఇక నుంచి ఏడాదికి రెండు..

సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ వేరు.. ప్రభాస్ వేరు. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలవుతున్నా.. చేసిన సినిమాలు మాత్రం ఇతర హీరోలతో పోలిస్తే చాలా తక్కువ. బాహుబలి సినిమా మొదలు ప్రభాస్ చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి కోసం ఐదేళ్లు.. సాహో కోసం రెండేళ్లకు పైనే టైమ్ కేటాయించాడు. గత ఏడాది నుంచి మాత్రం ప్రభాస్ రూట్ మార్చాడు. ఏడాదికి రెండు సినిమాల చొప్పున విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే గత ఏడాది ‘ఆదిపురుష్’, ‘సలార్’ మూవీస్ వచ్చాయి. ఈ ఏడాది కూడా రెండు సినిమాలను విడుదల చేసేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న కల్కి సినిమాలను లైన్‌లో పెట్టాడు. వీటిని ఈ ఏడాది ఎలాగైనా రిలీజ్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకే ఈ రెండు సినిమాలకి డేట్స్ ని అడ్జస్ట్ చేస్తూ రెండు సినిమాలను ఏక కాలంలో పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ప్రభాస్ రూట్ మార్చాడు.. ఇక నుంచి ఏడాదికి రెండు..

ఇక వచ్చే ఏడాదికి కూడా రెండు సినిమాలకు ప్రభాస్ లైన్‌లో పెట్టేశాడు. సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చే స్పిరిట్, అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చే సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు. ఇక మీదట సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయి మరీ అడుగులు వేస్తున్నట్టున్నాడు. అభిమానులు సైతం ఈ విషయం తెలిసి సంబరపడుతున్నారు. 

Google News