వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. సిట్టింగ్‌ల్లో14 మంది ఎంపీలు.. 32 మంది ఎమ్మెల్యేలు ఔట్..
ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైసీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఇడుపులపాయలో జగన్ ప్రకటించారు. ముందుగా ఇడుపుపాయకు వెళ్లిన జగన్.. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలకు గానూ 24 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అనకాపల్లి స్థానాన్ని బీసీకి కేటాయించారు కానీ అభ్యర్థి పేరును మాత్రం వెల్లడించలేదు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు. కాగా.. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టారు.
ఎంపీ అభ్యర్థుల జాబితా..
నంద్యాల – బ్రహ్మానందరెడ్డి
శ్రీకాకుళం – పేరాడ తిలక్
విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
విజయవాడ – కేశినేని నాని
అమలాపురం – రాపాక వరప్రసాద్
ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
రాజంపేట – మిథున్ రెడ్డి
విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
కాకినాడ- చెలమల శెట్టి సునీల్
తిరుపతి – మద్దెల గురుమూర్తి
కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి
నెల్లూరు – విజయసాయి రెడ్డి
కర్నూలు – బీవై రామయ్య
అనంతపురం – శంకర నారాయణ