ఏపీతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. కీ పాయింట్స్ ఇవే..

ఏపీతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. కీ పాయింట్స్ ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రానే వచ్చింది. నేడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్‌‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 25 వరకూ నామినేషన్ల స్వీకరణ.. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది.

నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29గా గడువు నిర్ణయించడమైంది. నేటితో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ఇక దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏపీలో ఎన్నికలు నాలుగో విడతలో జరగనున్నాయి. తెలంగాణలో బై పోల్ రానుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆ స్థానానికి బైపోల్ జరగనుంది. మే 13న ఈ బై పోల్ జరగనుంది. దేశ వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు బై పోల్ జరగనుంది. ఇక ఏపీతో పాటు ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను సైతం నేడు ఈసీ ప్రకటించింది.

Advertisement

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్

ఏప్రిల్ : 19 తొలిదశ ఎన్నికలు

ఏప్రిల్ : 26న రెండో దశ పోలింగ్

మే : 07 మూడో దశ పోలింగ్

మే : 13 నాలుగో దశ పోలింగ్

మే : 20 ఐదో దశ పోలింగ్

మే : 25 ఆరో దశ పోలింగ్

జూన్ : 01 ఏడో దశ పోలింగ్