సామజిక న్యాయం, సమతూకం, మహిళాశక్తి… వైసీపీ లిస్ట్ హైలెట్స్

అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ “వైనాట్ 175” అంటూ ఎన్నికల రంగంలోకి దిగింది. దానికి తగ్గట్లే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కసరత్తు చేశారని చెప్పొచ్చు.

సామజిక న్యాయం

ముందు నుంచి అనుకుంటున్నట్లే గత ఎన్నికల నాటికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు దక్కాయి. సామజిక న్యాయం అక్షరాలా పాటించారు. మహిళలకు కూడా ఎక్కువ సీట్లు దక్కడం విశేషం. 2019తో పోల్చితే మహిళలకు 4 సీట్లు పెరగ్గా, మైనార్టీలకు అదనంగా రెండు దక్కాయి.

ఎమ్మెల్యే లిస్ట్ చూస్తే…..

వర్గం20192024
ఎస్సీ
2929
ఎస్టీ
7 7
బీసీ41 48
TOTAL7784

మహిళలు, మైనార్టీల లిస్ట్

వర్గం20192024
మహిళలు1519
మైనార్టీలు57

ఎంపీ అభ్యర్థుల సామజిక న్యాయం

ఎంపీ అభ్యర్థుల్లో కూడా ఈ సారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు దక్కాయి. 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈసారి నాలుగు సీట్లు అదనంగా దక్కాయి. మహిళలకు ఒక్క సీటు పెరిగింది.

పార్టీ కోసం పనిచేసేవారికి దక్కిన గుర్తింపు

ఎస్సార్సీ పార్టీ మొదటి నుంచి కార్యకర్తల శ్రమని, అంకితభావాన్ని గుర్తించి, గౌరవిస్తూ వస్తోంది. పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తలకు ఈ సారి అధికంగా సీట్లు ఇచ్చింది. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్యకర్తల జాబితా నుంచి ఈ సారి 14 మందికి అవకాశం ఇచ్చింది.

అందరూ విద్యావంతులే

మొత్తం అభ్యర్థుల్లో 151 మంది గ్రాడ్యుయేట్లు. 58 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు. 6 డాక్టర్లు. ఇక లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులకు కూడా అవకాశాలు దక్కాయి.

డాక్టర్లు – 17
లాయర్లు – 15
ఇంజనీర్లు – 34
టీచర్లు – 5
సివిల్ సర్వెంట్లు – 2
డిఫెన్స్ – 1
జర్నలిస్ట్ – 1