Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..

Hari Hara Veeramallu: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ప్రముఖ డైరెక్టర్ క్రిష్(Krish) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veeramallu). ఈ పిరియాడిక్ డ్రామా గత మూడేళ్లుగా తెరకెక్కుతూనే ఉంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆదిలోనే చాలా కాలం పాటు వాయిదా పడింది.

ఇక అన్నీ సెట్ అయ్యాయి.. సెట్స్‌పైకి వెళదాం అనుకునే లోపు పవన్ కల్యాన్(Pawan Kalyan) వేరే సినిమాలకు కమిట్ అయ్యారు. మరోవైపు పొలిటికల్‌గా కూడా ఆయన బాగా బిజీ అయ్యారు. దీంతో హరిహర వీరమల్లు షూటింగ చాలా కాలం పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలి కాలంలో మాత్రం సినిమా షూటింగ్ ఊపందుకుంది. ఇటీవలే ప్రి ఇంటర్వెల్ సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించారు. ఈ ఒక సన్నివేశాన్నే దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ జరిపారు.

Hari Hara Veeramallu: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..

ప్రస్తుతం హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) చిత్రం క్లైమాక్స్‌కి చేరుకుంది. ప్రి ఇంటర్వెల్ సన్నివేశం షూటింగ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ చిత్రం కోసం ఈ నెల మూడవ వారం నుంచి పవన్ డేట్స్ కేటాయించారని సమాచారం.

నెలరోజులకు పైగా ఈ షెడ్యూల్ సాగనుందట. ఈ షెడ్యూల్‌లో ప్రి క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారని టాక్. ఈ షెడ్యూల్‌తో గుమ్మడికాయ కొట్టేస్తారట. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Google News