Niharika Konidela: కాలమే సమాధానం చెబుతుంది.. నిహారిక పోస్ట్ వైరల్
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్గా నిహారిక కొణిదెల(Niharika Konidela) పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్లో కూడా నిహారిక ఉంటుంది. తాజాగా ఆమె విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో కాక రేపుతున్న విషయం తెలిసిందే. నిహారిక(Niharika Konidela) దంపతులు ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫోటోలను తొలగించడంతో విడాకుల వార్తలు మరింత పెరిగాయి.
ఇక మరి ఈ విడాకుల విషయానికి పెద్దలు ఫుల్ స్టాప్ పెట్టారో లేదో తెలియదు కానీ నిహారిక తాజా సోషల్ మీడియా పోస్టు మాత్రం మరోసారి విడాకుల అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చేసింది. ప్రస్తుతం నిహారిక(Niharika Konidela) నిర్మాతగా వ్యవహరిస్తున్న మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్న వారికి తెలిసే ఉంటుంది.
తన నిర్మాణ సంస్థ కోసం హైదరాబాద్‌లో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది. ఈ క్రమంలోనే తన ప్రొడక్షన్ కంపెనీ కొత్త ఆఫీస్‌కు సంబంధించిన ఫొటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఈ ఫోటోలను పోస్ట్ చేసి ఊరుకుంటే బాగానే ఉండేది. వాటికి తోడు తాను జిమ్ చేస్తున్న వీడియోతో పాటు దానికి ఒక పోస్ట్‌ను కూడా నిహారిక(Niharika Konidela) జత చేసింది. ‘‘నీతో నువ్వు మంచిగా ఉండు.. అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది’’ అంటూ పోస్ట్ పెట్టింది.
దీనిని చూసిన నెటిజన్లు ఏ గాయాలకు కాలం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. విడాకుల నుంచి బయటపడేందుకు నిహారిక బాగా ట్రై చేస్తోందని.. అందుకే ఈ పోస్ట్ పెట్టిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.