Hyper Aadi: హైపర్ ఆదిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

Hyper Aadi

హైపర్ ఆది(Hyper Aadi)కి మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ అని పేరు. ఆయన స్కిట్స్‌తో ఎంత కామెడీ పండిస్తాడో.. అంతే వివాదాస్పదం అవుతుంటాడు కూడా. నిజానికి హైపర్ ఆది జబర్దస్త్‌ (Jabardasth)లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అది రూట్ మార్చుకుందని టాక్. ఈ షోలో అంతకు ముందు పెద్దగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కనిపించేవి కాదు. కుళ్లు పంచ్‌లు అంతకన్నా ఉండేవి కాదు. కానీ ఆది ఎంటర్ అయిన దగ్గర నుంచి పంచ్‌లకు కొదువ లేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కు ఢోకా లేదు. అసలు ఆయన స్కిట్‌లో ఇవి తప్ప మ్యాటరే ఉండదని టాక్.

అయితే సమకాలీన విషయాల మీద హైపర్ ఆది(Hyper Aadi) వేసే పంచ్‌లు బాగా పేలుతాయి. అలాగే అవి వివాదాస్పదం కూడా అవుతుంటాయి. కొన్ని సామాజిక వర్గాలు, వ్యక్తులు, ప్రభుత్వాలు కూడా హైపర్ ఆది కామెడీ పంచ్‌లపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అయిన సందర్భాలూ లేకపోలేదు. ఒకటి రెండు సందర్భాల్లో హైపర్ ఆది క్షమాపణలు చెప్పడం జరిగింది. తాజాగా హైపర్ ఆది(Hyper Aadi) చేసిన మరో కామెంట్ వివాదాస్పదం అవుతోంది.

Hyper Aadi

శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company) లేటెస్ట్ ఎపిసోడ్‌లో హైపర్ ఆది(Hyper Aadi) ఒక స్కిట్ చేశాడు. ఈ స్కిట్‌లో భర్తలపై వేధింపులను వ్యతిరేకించే వ్యక్తి పాత్రను తీసుకున్నాడు. స్కిట్‌లో భాగంగా భార్యను ఉద్దేశిస్తూ.. ‘‘సంక్రాంతికి చీర అడుగుతారు. కొనిస్తాము. అదేమైనా కడతారా లేదు. ఎప్పుడూ నైటీ ఒకటి వేసుకుంటారు. పిల్లాడి ముక్కు చీది దానికి తుడుచుకుంటారు. దాంతో మా దగ్గరికి వస్తారు. గవర్నమెంట్‌కి నేను చేసే విజ్ఞప్తి ప్లాస్టిక్ ఒక్కటే కాదు. మీరు వేసుకునే నైటీలు కూడా బ్యాన్ చేయాలని’’ అన్నాడు. దీంతో ఆది కామెంట్స్‌ను పలువురు నెటిజన్లు తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Google News