VV Vinayak: వీవీ వినాయక్ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారా?

VV Vinayak

ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్‌లో వీవీ వినాయక్ (VV Vinayak) ఒకరు. ఇక మాస్ డైరెక్టర్స్ లిస్టులో ఆయన పేరు ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఆయన హిట్ లిస్ట్ చాంతాండంత ఉంటుంది. ఆదితో మొదలైన ఆయన ప్రస్థానం ఖైదీ నంబర్ 150 వరకూ అప్రతిహతంగా కొనసాగింది. చెన్నకేశవ రెడ్డి (Chennakesava Reddy), దిల్(Dil) , ఠాగూర్(Tagore), బన్నీ (Bunny), లక్ష్మీ (Lakshmi), కృష్ణ (Krishna), అదుర్స్(Adhurs), నాయక్(Nayak), అల్లుడు శీను (Alludu Seenu) మరియు ఖైదీ నెంబర్ 150 వంటి హిట్స్ ఇండస్ట్రీకి అందించారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం ఆయనకు ఎందుకో వెనుకబడిపోయారు. 

ఖైదీ నెంబర్ 150 (Khaidi No 150) సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తో చేసిన ‘ఇంటెలిజెంట్’ (Intelligent) సినిమా ఆయన కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా నుంచే ఆయన ఇండస్ట్రీలో ఆయన హవా తగ్గిపోవడం ఆరంభమైంది. ఆ తరువాత మెల్లమెల్లగా టాలీవుడ్‌కి ఆయన దూరమవుతూ వస్తున్నారు. అయితే ఇంటెలిజెంట్ వంటి చెత్త సినిమా కాకుండా మరో మంచి కథ దొరికితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని వీవీ వినాయక్(VV Vinayak) భావిస్తున్నారట. కానీ ఆయనకు అలాంటి కథ దొరకడం లేదని టాక్.

Chtrapathi bollywood movie

ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్‌లో సినిమా తీయడం ఆరంభించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో బాలీవుడ్‌లో ఛత్రపతి రీమేక్ చేస్తున్నారు. సుమారుగా మూడేళ్ల నుంచి ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది.

తాజాగా విడుదలైన అప్‌డేట్స్ అన్నింటికీ మంచి టాకే వస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే వినాయక్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. అదేంటంటే.. ఛత్రపతి హిందీ రీమేక్ పూర్తయ్యాక ఆయన (VV Vinayak) దర్శకత్వానికి గుడ్ బై చెప్పబోతున్నారట. మరి దీనిలో నిజమెంత అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!