Ram Charan-Upasana: రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర చర్చ

Ram Charan, Upasana

స్టార్ హీరో రామ్ చరణ్‌(Ram Charan)కు ఇటీవలి కాలంలో గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. ఒకవైపు తండ్రిగా ప్రమోషన్.. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కడం. ఇంతకంటే ఆనందం ఏ హీరోకైనా ఏం ఉంటుంది? మొత్తానికి మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఆంజనేయుడి ఆశీస్సులతో రామ్ చరణ్(Ram Charan) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఎంతో కాలంగా ఈ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇక ఉపాసన (Upasana Konidela) దంపతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఉపాసనకు ఆమె స్నేహితులు అక్కడే సీమంతం కూడా చేసిన విషయం తెలిసిందే. నేడో రేపో చెర్రీ దంపతులు ఇండియాకు రానున్నారని టాక్. ఇక్కడకు రాగానే ఇరు కుటుంబాలు ఉపాసన (Upasana) సీమంతంను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారనే టాక్ కూడా ఉంది.

ఇక ఉపాసన ప్రసవం అమెరికాలో ఉంటుందని ప్రచారం నడించింది. ఇది అంతా ఫేక్ అని ఆమె తెలిపారు. తన డెలివరీ అపోలో ఆసుపత్రి, హైదరాబాద్‌లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. 

Ram Charan Upasana2

ఇక తాజాగా చెర్రీ దంపతులకు పుట్టబోయే బిడ్డ విషయమై ఓ ఆసక్తికర టాక్ నడుస్తోంది. వీరికి బాబు పుడితే చెర్రీ (Ram Charan) స్టార్ డమ్ మరింత పెరుగుతుందట. కెరీర్ బీభత్సమైన పీక్స్‌లో ఉంటుందట. అటు ఉపాసనకు కూడా బిజినెస్ అద్భుతంగా ఉంటుందట. అదే అమ్మాయి పుడితే మాత్రం వీరిద్దరికీ ఇబ్బందులు తప్పవట. రామ్ చరణ్ దంపతులను సమస్యలు చుట్టుముడతాయని టాక్.

ఇదంతా ఫేక్ అని మెగా అభిమానులు అంటున్నారు. వీరికి ఎవరైనా ఓకే అని అంటున్నారు. జాతకాలనేవి కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టి పడేస్తున్నారు.

Google News