Kushboo Sundar: మాజీ భర్త కోసం తన గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుందన్న ఖుష్బూ.. ఇప్పుడిదే హాట్ టాపిక్..

Kushboo latest tweet goes viral

ఖుష్బూ (Kushboo Sundar)… సౌత్ ఇండియాలో ఆమె తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు పొలిటికల్‌గానూ రాణిస్తోంది. 986లో వచ్చిన కలియుగ పాండవులతో ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లోనూ తిరుగులేని తారగా ఎదిగింది. ఒక హీరోయిన్‌ను ఇష్టపడి గుడి కట్టడం అనేది కుష్బూ విషయంలోనే జరిగింది. అయితే ఖుష్బూ ఇటీవల కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని చెప్పారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఖుష్బూ(Kushboo Sundar) ఒకప్పుడు తమిళ నటుడు ప్రభు(Prabhu)తో ప్రేమ వ్యవహారం నడిపారు. అది పెళ్లి వరకూ వెళ్లింది. అది ఎందుకోగానీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిన్న తంబి (Chinna Thambi) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అయితే 1993లో వీరి ప్రేమ పెళ్లిగా మారింది. అప్పటికే ప్రభుకి వివాహం అయి ఉండటంతో ఆయన తండ్రి, ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ వీరి పెళ్లిని నిరాకరించారు. దీంతో వీరిద్దరూ విడిపోయారు.

Kushboo, Prabhu

2000వ సంవత్సరంలో దర్శకుడు సి.సుందర్‌ను ఖుష్బూ మరో వివాహం చేసుకున్నారు. అంతటితో మ్యాటర్ ఓవర్. ఇక తాజాగా ఖుష్బూ(Kushboo Sundar) మాజీ భర్త ప్రభుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 1991లో ప్రభు, ఖుష్బు జంటగా రూపొందిన తంబీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు ఏప్రిల్ 12తో 32 ఏళ్లు.

Kushboo, Prabhu in Chinna Thambi

ఈ సందర్భంగా ఖుష్బు పోస్టు పెట్టారన్నమాట. ‘చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే అసలు నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రభు (Prabhu) కోసం తన గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుందన్న కామెంట్‌ను మాత్రం ఈ ట్వీట్‌లో పట్టుకున్న నెటిజన్లు తిరిగి వీరి ప్రేమ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారు.

Google News