Sreeleela: శ్రీలీల ఇలాంటివి తగ్గించుకోవడం బెటర్.. లేదంటే అస్సామే..

Sreeleela

టాలీవుడ్‌లో శ్రీలీల (Sreeleela) హవా ఓ రేంజ్‌లో ఉంది. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ శ్రీలీల (Sreeleela) జపమే. అమ్మడికి ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతుంటడంతో హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోపే పైగా అమ్మడి తొలి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లను మనం చూడలేదు. రంభ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలే అనే టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది.

అమ్మడికి మరోవైపు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ మామూలుగా లేదు. శ్రీలీల(Sreeleela) డ్యాన్స్ కూడా ఇరగదీస్తుండటంతో క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. కేవలం ఈ ముద్దుగుమ్మ కోసమే థియేటర్స్‌కు ఆడియన్స్ వస్తున్నారనే టాక్ కూడా లేకపోలేదు. అందుకే దర్శక నిర్మాతలు శ్రీలీల(Sreeleela) ఇంటికి క్యూ కడుతున్నారట. ఈ క్రమంలోనే అమ్మడు తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. అయినా సరే అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్‌ను గంటల లెక్కన తీసుకుంటోందని టాక్.

Sreeleela

ఒక గంటపాటు శ్రీలీల(Sreeleela) షూటింగ్ లొకేషన్‌లో ఉంటే రూ.5 లక్షల రూపాయిలు ముట్టజెప్పాలట. ఇక ఈ ముద్దుగుమ్మ ఎన్ని గంటలు అలా ఎన్ని గంటలు ఉంటె అన్ని 5 లక్షల రూపాయిలు. అసలు ఇలా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్లు ఇప్పటి వరకూ ఇండస్ట్రీలోనే లేరట. స్టార్ హీరోలు మాత్రం ఇలా తీసుకుంటారట. అయితే అంతా మంచిగా ఉంటే అన్నీ సాగుతాయి కానీ ఒక్కసారి సీన్ రివర్స్ అయ్యిందంటే మాత్రం అమ్మడిని కాపాడటం ఎవరి తరమూ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఇదే నిజమైతే ఇలాంటి తగ్గించుకోవాలని సలహా ఇస్తున్నారు. లేదంటే అస్సామే..

Google News