NTR 30: ఎన్టీఆర్ 30 నుంచి లుక్ లీక్.. మెగాస్టార్‌ని తలపిస్తున్న తారక్..

NTR30

స్టార్ హీరోల సినిమాలకు లీక్‌ల బాధ ఉండటం సహజం. అందుకే దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తన సెట్స్‌లోకి ఎవ్వరికీ సెల్ ఫోన్ అనుమతించరు. కొన్ని సార్లు దెబ్బ తిన్న తరువాత ఈ డెసిషన్ తీసుకున్నారు. కానీ కొరటాల శివ (Koratala Siva) అలాంటి నిర్ణయాలేం తీసుకోకపోవడం ఇప్పుడు ఎన్టీఆర్ 30 (NTR 30)కి ఇబ్బందికరంగా పరిణమించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్స్ లో ఎన్టీఆర్ 30 (NTR 30) షూటింగ్ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ 30(NTR 30) నుంచి తారక్ లుక్ లీకైంది. ఊర మాస్ గెటప్‌లో తారక్ కనిపిస్తున్నాడు. ఆయన డ్రెస్ చూస్తే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఉప్పెన మూవీలో వైష్ణవ్ తేజ్ గుర్తు వస్తున్నారు. డ్రెస్ చూస్తే వీరిద్దరూ గుర్తొస్తున్నారంటే ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడం ప్రేక్షకులకు పెద్ద పనేం కాదు. ఎస్.. ఎన్టీఆర్ జాలరిగా నటిస్తున్నారంటూ టాక్ మొదలైంది.

NTR 30

దర్శకుడు చెప్పిన మాటను సింక్ చేసుకుని మరీ గెటప్‌పై ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఇది సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథ అని చెప్పిన విషయం తెలిసిందే. సముద్రంతో ముడిపడి ఉన్న కథ కాబట్టి హీరో జాలరిగా కనిపిస్తాడని ఒక అంచనాకైతే వచ్చేశారు. ఇక లీకైన లుక్‌లో ఎన్టీఆర్ (NTR) డ్రెస్ కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది. కలర్ ఫుల్ షర్ట్ ధరించి మాస్ గెటప్‌లో జాలరిలా తారక్ ఉన్నారు. కాలనీలో విలన్‌తో గొడవపడుతున్నట్లుగా ఉందా సన్నివేశం చూస్తుంటే. ఇక జాన్వీ కపూర్ అయితే ఓ పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఐదు భాషల్లో విడుదల కానుంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!