Shaakuntalam: సమంత నటించిన ‘శాకుంతలం’ హిట్టా.. ఫట్టా?

Shaakuntalam Review

‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా విడుదల కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ‘యశోద’(Yashoda) మూవీ తర్వాత సమంత నటించిన సినిమా కావడంతో అంచనాలు బీభత్సంగానే ఉన్నాయి. మైథలాజికల్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన శాకుంతలం అంచనాలకు తగ్గట్టుగా ఉందా? అంటే లేదనే సమాధానమే ప్రేక్షకుల నుంచి వస్తోంది. శాకుంతలం పక్షులు ఓ పసిబిడ్డను కణ్వముని ఆశ్రమానికి సమీపంలో వదిలి వెళతాయి. ఆ చిన్నారికి శకుంతల అని పేరు పెట్టి కణ్వముని పెంచి పెద్ద చేస్తారు.

పులుల్ని వేటాడుతూ అటుగా వచ్చిన దుష్యంత రాజు శకుంతలని చూసి ప్రేమలో పడతాడు. శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడుతుంది. ఆ తరువాత జరిగే పరిణామాలతో కథను రూపొందించారు దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar). అయితే ఈ సినిమాలో ట్విస్టులంటూ ఏమీ లేవని.. ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఒక్కో క్యారెక్టర్‌ని పరిచయం చేసిన తీరు మాత్రం అద్భుతం అంటున్నారు. ఇక మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కడా కూడా తావివ్వలేదంటున్నారు. ఒక ఫ్లోలో కథ వెళుతూ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుందట.

Samantha in Shaakuntalam

ఇంటర్వెల్ కార్డ్ మాత్రం ఒక చిన్న ట్విస్ట్‌తో ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి గుణశేఖర్ (Gunasekhar) కథ ఏదో నడిపించారు కానీ ఫస్ట్ హాఫ్‌లో మాత్రం ఆకట్టుకునే ఎమోషన్స్ అయితే లేవంటున్నారు. శకుంతల, దుష్యంతుడు లవ్ ఓకే కానీ వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సరైన సీన్స్ ఒక్కటి కూడా పడలేదట. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు సెట్సే కీలకం. కానీ ఆకట్టుకునే సెట్స్ ఒక్కటి కూడా లేదని టాక్. గ్రాఫిక్స్ చాలా ఘోరంగా ఉన్నాయంటున్నారు. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయ్యాయంటున్నారు. ఇక సమంత (Samantha) డబ్బింగ్‌ కూడా దారుణంగా ఉందట. ఏదో కష్టంగా చెప్పినట్టు ఉంది తప్ప ఇష్టంగా చెప్పినట్టు లేదంటున్నారు.

Your Opinion on Shaakuntalam Movie:

శాకుంతలం సినిమా ఎలా ఉంది ?

  • అస్సలు బాగోలేదు (63%, 5 Votes)
  • చాలా బాగుంది (38%, 3 Votes)
  • పర్వాలేదు (0%, 0 Votes)
  • బాగోలేదు (0%, 0 Votes)

Total Voters: 8

Loading ... Loading ...
Google News