Kavya Kalyanram: అడ్డంగా దొరికిపోయిన ‘బలగం’ బ్యూటీ.. ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్స్..

Kavya Kalyanram

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అనగానే మనకు కావ్యా కల్యాణ్ రామ్ (Kavya Kalyanram) గుర్తుకు వస్తుంది. చైల్డ్ ఆర్టిస్టుగానే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన కావ్య.. హీరోయిన్‌గా మారి మంచి హిట్స్ అందుకుంటోంది. అంతుకు ముందు నటించిన మసూద మూవీ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు బలగం మూవీ అయితే అమ్మడికి తిరుగులేని విజయాన్ని అందించింది. ఈ సినిమా సక్సెస్‌తో అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇప్పడు మరో కొత్త చిత్రంతో కావ్య(Kavya Kalyanram) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి (Srisimha Koduri) హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీ సింహా కూడా చైల్డ్ ఆర్టిస్టుగానే తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫణిదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కావ్యకు మరో హిట్ ఖాయమని ఇండస్ట్రీ టాక్.

ఇక ‘ఉస్తాద్’ (Ustaad) టీజర్ లాంచ్ సందర్భంగా కావ్య (Kavya Kalyanram) మాట్లాడిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కథ గురించి కావ్య మాట్లాడుతూ.. సినిమాకి సంబంధించి సాంగ్స్, ట్రైలర్ బాకీ ఉన్నాయని తెలిపింది. ఉస్తాద్ అంటే లైఫ్‌లో ఏమైనా నేర్పించే టీచర్ అని.. అయితే సినిమాలో హీరో టీచర్ కాదని.. ఆయన బైక్ పేరు ఉస్తాద్ (Ustaad) అని తెలిపింది. ఆ బండి నుంచి అతనేం నేర్చుకున్నాడనే కథ అని వెల్లడించింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ లాస్ట్‌లో.. ‘ఇంక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లలో మమ్మల్ని ఏసుకోకండి’ అని ముగించింది. ఇక అంతే అన్నీటిని వదిలేసి ఆ చివరి మాటలను మాత్రం నెటిజన్స్ పట్టుకుని కూర్చొన్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!