Ravi Babu: పూర్ణతో లవ్ అఫైర్ ఉందన్న రవిబాబు.. ఇన్నాళ్లకు క్లారిటీ

Ravi Babu clarifies about affair with Poorna

రవిబాబు(Ravi Babu).. గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నటుడిగానూ.. దర్శకుడిగానూ ఆయన ఇండస్ట్రీలో అద్భుతంగా రాణిస్తున్నారు. వినూత్న తరహా సినిమాలకు బాట వేసింది కూడా ఆయనే. పంది పిల్లతో సినిమా తీసి అవాక్కయ్యేలా చేశారు. తండ్రి ఇమేజ్‌తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. వీలైనంత వరకూ తక్కువ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో ఆయన కూడా ఒకరు కావడం గమనార్హం.

ఇక రవిబాబు(Ravi babu) సినిమాల్లో ఎక్కువగా కనిపించే హీరోయిన్ పూర్ణ(Poorna). ఆయన దర్శకత్వంలో రూపొందిన అవును మూవీ నుంచి నేటి అసలు మూవీ వరకూ పలు చిత్రాల్లో ఆమే మెయిన్ లీడ్. దీంతో పూర్ణ(Poorna)కు, రవిబాబు(Ravi Babu)కు ఏదో లవ్ అఫైర్ ఉందంటూ టాలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. తాజాగా తనపై జరుగుతున్న ప్రచారానికి రవిబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పూర్ణతో తనకు లవ్ అఫైర్ ఉందని చాలా మంది అనుకుంటారని… అది నిజమేనని కానీ తనకు ఆమెతో ఉన్న లవ్ ఎఫైర్ జనాలు అనుకునేది కాదన్నారు.

విజువలైజ్ చేసుకున్న దాని కంటే 200 శాతం బెస్ట్ ఔట్​పుట్‌ను అందించే ప్రత్యేక నటులను డైరెక్టర్లు సాధారణంగా ఇష్టపడతారన్నారు. తాను కూడా అలాగే పూర్ణను ఇష్టపడ్డానని రవిబాబు(Ravi Babu) వెల్లడించారు. పూర్ణ 200 శాతం బెస్ట్ ఔట్​పుట్‌ను అందించే ఓ జెమ్’ అని రవిబాబు కొనియాడారు. రవిబాబు కొత్త మూవీ ‘అసలు’ ఈటీవీ విన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్​లో ఏప్రిల్ 13న విడుదల కానుంది. ఇటీవలి కాలంలో ఆయనకు హిట్స్ అంటూ ఏమీ లేవు. మరి ఈ సినిమా ఏమవుతుందో వేచి చూడాలి.

Google News