Mahesh Babu – Trivikram Movie: మహేష్ – త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్

Mahesh Babu in SSMB 28

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వరుస సూపర్ హిట్స్‌తో మాంచి జోష్ మీద ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ (Trivikram Srinivas) కూడా ‘అలా వైకుంఠపురం లో’ (Ala Vaikuntapuramlo) వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా మోస్ట్ అవైటెడ్ లిస్ట్‌లోకి మారింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అవి అంత కమర్షియల్ హిట్ కాకున్నా కూడా ప్రేక్షకులు మాత్రం వీరిద్దరి కాంబో కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్‌ను ఊరిస్తున్నాయి.

మహేష్ (Mahesh Babu) సినిమాలు ఈ మధ్య వరుసగా హిట్ అవుతుండటంతో ఇప్పుడు త్రివిక్రమ్‌ (Trivikram)తో సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభం అయిపోయిందని టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ సినిమాను జనవరి 13 వ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ ఇటీవల మేకర్స్ ఒక పోస్టర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. నోట్లో సిగరెట్ పట్టుకొని మహేష్ బాబు (Mahesh Babu) స్టైల్‌గా నడిచి వస్తున్న ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Mahesh Babu Trivikram Movie

మహేష్ (Mahesh Babu) స్మోక్ చేస్తున్నాడంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టేనని టాక్ కూడా నడిచింది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా కథకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఈ మూవీలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్. తండ్రి కొడుకు పాత్రలలో కనిపిస్తాడట. కొడుకు ఓకే కానీ తండ్రి పాత్రకు మహేష్ సెట్ అవుతాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. కథ కాస్త ‘వీర సింహా రెడ్డి’ తో పోలి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!