Pushpa 2: ‘పుష్ప 2’కి బాయ్‌కాట్ సెగ.. ఇబ్బందులు తప్పనట్టేనా?

Pushpa 2

బాయ్ కాట్ ట్రెండ్ అనేది మెల్లమెల్లగా అన్ని ఇండస్ట్రీలకు పాకుతోంది. ఇప్పటకే బాలీవుడ్‌కి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ట్రెండ్ టాలీవుడ్‌కి కూడా చేరింది. అమీర్ ఖాన్ (Amir Khan), అక్షయ్ (Akshay Kumar), హృతిక్ రోషన్ (Hrithik Roshan) వంటి స్టార్స్ సైతం ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌కి బలైన వారిలో ఉన్నారు. ఒక్క షారుఖ్ (Shahrukh Khan) మాత్రం ఈ ట్రెండ్ నుంచి బయటపడ్డారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో బాయ్‌కాట్ ట్రెండ్ మట్టిగొట్టుకుపోయింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఈ ట్రెండ్ తొలుత బలైంది మాత్రం రౌడీ హీరో విజయ్ దేవరకొండే (Vijay Deverakonda).

బాలీవుడ్ లో బాయ్ కాట్ లైగర్ (Liger) అంటూ పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఈ చిత్ర ఓపెనింగ్స్‌కి ఇదొక పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ విషయాన్ని స్వయంగా ముంబై డిస్ట్రిబ్యూటర్ ఒకరు చెప్పారు. ఇక తాజాగా బాయ్ కాట్ ట్రెండ్ అనేది పుష్ప 2 (Pushpa 2)ని తాకింది. తాజాగా విడుదలైన లుక్ దీనికి కారణం.

Allu Arjun in Pushpa 2

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప 2 (Pushpa The Rule) నుంచి ఒక లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అమ్మోరు రూపంలో చీర ధరించి అల్లు అర్జున్ చేతిలో గన్ పట్టుకున్నట్టుగా పోస్టర్‌ను డిజైన్ చేసి చిత్ర యూనిట్ వదిలింది.

దేవత రూపం ధరించిన అల్లు అర్జున్ (Allu Arjun) గన్ పట్టుకోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ వాదన మరోలా ఉంది. గన్ కూడా ఒక ఆయుధమేనని.. శత్రు సంహారం కోసం ఏ ఆయుధం వాడితే ఏంటని ప్రశ్నిస్తున్నారు. చెడ్డవారిని సంహరించేందుకు బన్నీ ఆ గెటప్ వేసుకున్నాడని చెబుతున్నారు. ఇదంతా బన్నీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. మరి ఈ బాయ్‌కాట్ ట్రెండ్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!