Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను టార్గెట్ చేస్తున్నదెవరు? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..

Kiran Abbavaram

టాలెంట్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి లక్ చాలా ఉండాలి. ఒకవేళ అడుగు పెట్టినా కూడా నిలదొక్కుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇక్కడ ఉన్నన్ని కుట్రలు, కుంతంత్రాలు మరే ఇండస్ట్రీలో ఉండవన్నది టాక్. ఇక సినిమా హిట్ అవ్వాలంటే కథల ఎంపిక తెలుసుకోవడం అత్యవసరం. కథలో కొత్తదనం.. ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంటు లేకపోతే ఎన్ని సినిమాలు చేసినా వేస్టే. ఒక్కోసారి కంటెంట్‌లో దమ్మున్నా కూడా హిట్ అవడం కష్టమే. ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) విషయంలోనూ ఇదే జరుగుతోంది.

మంచి టాలెంట్‌, సినిమాల మీద ప్యాషన్‌ ఉన్న కిరణ్‌ అబ్బవరం హిట్లు అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. సినిమాలు చేస్తున్నాడు కానీ ఎందుకు హిట్ మాత్రం పడటం లేదు. తనను కావాలనే తప్పుడు ‍ప్రచారాలతో తొక్కేస్తున్నారంటూ కిరణ్ (Kiran Abbavaram) ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కు అవకాశాలు బాగానే వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అనేది మాత్రం పడలేదు. అతని కెరీర్‌లో ‘ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం’ సినిమా ఒక్కటి కాస్త బెటర్ అని చెప్పాలి. కిరణ్‌కు అంతో ఇంతో గుర్తింపు తెచ్చి పెట్టింది.

ఇక ‘ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం’ (SR Kalyanamandapam) తర్వాత వచ్చిన సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలోనే.. వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమా విడుదలైంది. ఈ సినిమా సందర్భంగా కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కొంతమంది టార్గెట్‌ చేసి తొక్కేస్తున్నారని, అలాంటి వారికి భయపడేది లేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

దీంతో అసలు కిరణ్ అబ్బవరంను ఎవరు తొక్కేయాలని చూస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరో కిరణ్‌ను తొక్కేయడం కాదు.. తనను తనే తొక్కేసుకుంటున్నాడని కొందరు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఫోకస్ లేదని.. దీంతో సినిమా ఫ్లాప్ అవుతోందంటున్నారు. సినిమా పెద్దదా.. చిన్నదా అనే దాంతో సంబంధం ఉండదని.. మంచి కథ ఏదైనా ప్రేక్షకులు ఓటేస్తారని చెబుతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!