Mrunal Thakur: ‘సీతారామం’ సీక్వెల్‌పై మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Mrunal Thakur in Seetharamam

గత ఏడాది వచ్చిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండే పోయే చిత్రాల్లో సీతారామం(Seetharamam) ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ మైమరచిపోతారు. ఏ పాత్రకు ఆ పాత్ర అద్భుతం. ఇక హీరో, హీరోయిన్లు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), ముణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అయితే నటించలేదు.. జీవించారు.

ఈ సినిమా చూస్తున్నంత సేపూ మన పక్కింటి వ్యక్తులను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమా స్టోరీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులనూ బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి.

మొత్తానికి యుద్ధంతో రాసిన ప్రేమకథగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉందా? అనేది ఇప్పుడు కాదు.. సినిమా చూసినప్పటి నుంచి ఆడియన్స్ మదిలో మెదులుతున్న డౌట్. కొందరు దుల్కర్(Dulquer Salman) చనిపోలేదు.. తప్పకుండా సీక్వెల్ ఉంటుందని నమ్ముతున్నారు. కొందరు మాత్రం ఎలాంటి హింట్ ఇవ్వలేదు కాబట్టి సీక్వెల్ ఉండే ఛాన్స్ లేదంటున్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్‌పై మృణాల్ (Mrunal Thakur) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Dulquer Salman and Mrunal Thakur in Seetharamam

మృణాల్ నటించిన ఒక బాలీవుడ్ మూవీ రిలీజైన సందర్భంగా ఆమె ఫ్యాన్స్​తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సీతారామం-2’ (Seetharamam 2) ఉంటుందా అని మృణాల్‌ను ఓ అభిమాని అడిగాడు. ఈ క్వశ్చన్​కు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) స్పందిస్తూ.. ‘సీతారామం’ ఒక అద్భుతమైన సినిమా అని.. సీతారామం మూవీ సీక్వెల్ గురించి ప్రస్తుతానికైతే తన దగ్గర సమాచారం లేదని తెలిపింది. అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని పేర్కొంది. మొత్తానికి మృణాల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!