Jabardasth Avinash: జబర్దస్త్ అవినాష్‌కు బన్నీ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్

Allu Arjun fans waring to Jabardasth Avinash

స్టార్ హీరో అభిమానుల మధ్య వార్ సర్వసాధారణం. అటాక్‌లు.. కౌంటర్‌లు సోషల్ మీడియాలో సందడే సందడి. అయితే తమ హీరోల జోలికి ఎవరైనా వస్తే మాత్రం అభిమానులు అస్సలు ఊరుకోరు. తాజాగా ఒక బుల్లితెర కమెడియన్‌ని ఓ స్టార్ హీరో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకుంటున్నారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆ కమెడియన్ మరెవరో కాదు.. జబర్దస్త్ అవినాష్ (Jabardasth Avinash). ఇక ఆ స్టార్ హీరో ఎవరంటారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఇంతకీ బన్నీ ఫ్యాన్స్‌.. అవినాష్‌కి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారనే కదా మీ డౌట్.

తాజాగా పుష్ప 2 (Pushpa 2) నుంచి టీజర్‌తో పాటు.. ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ వదిలిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. అమ్మవారి రూపంలో బన్నీ ఊర మాస్ పిక్ అభిమానులను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ పిక్ దుమ్ము రేపుతోంది. దీనిని తీసుకుని చాలా మంది ఓన్ మేడ్ పిక్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక అవినాష్ కూడా వారిని అనుసరించాడు. తను కూడా ఓ ఓనే్ మేడ్ పిక్ రెడీ చేశాడు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బన్నీకి విషెస్ తెలిపాడు.

బన్నీకి విషెస్ తెలిపితే తప్పేముంది.. అనుకుంటున్నారా? మరి అవినాష్(Avinash) ఎడిటింగ్ ఆ రేంజ్‌లో ఉంది మరి.. అరకొర ఎడిటింగ్‌తో పిక్‌ను మొత్తానికే చెడగొట్టాడు. దానిని ఇన్‌స్టాలో పెట్టి బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫోటో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun Fans) అవినాష్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ముందు ఆ పిక్‌ను డిలీట్ చేయాలని.. ఫ్యాన్స్‌ను ఇరిటేట్ చేయవద్దని తెలియజేస్తున్నారు. బన్నీ పిక్ గంగమ్మ తల్లిలా ఉందని.. అవినాష్ చేసింది.. పక్కింటి మంగమ్మలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జెంట్‌గా ఆ పిక్ డిలీట్ చేయకుంటే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు.

Google News