Ram Charan: రామ్ చరణ్‌ కారణంగా మెగా ఫ్యామిలీ రేంజ్ మారిపోయిందంటూ అల్లు అరవింద్ ప్రశంసలు

Allu Aravind praises on Ram Charan

‘ఆర్ఆర్ఆర్’(RRR) తెలుగు వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం. ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి కారణం ఆస్కార్ అవార్డు పొందడమే. ఈ చిత్రంలోని నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ఇప్పుడు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. మొత్తానికి ఒక్క ఆస్కార్‌(Oscar)తో ఈ సినిమా ఎందరికో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. సినిమాకు ఆస్కార్ అనగానే తమకే వచ్చినట్టు సౌత్ ఇండియా మొత్తం ఫీల్ అయ్యింది.

అయితే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకొన్న చిత్ర యూనిట్.. తాజాగా హైదరాబాద్ లో ‘ఆస్కార్ వేడుక’ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేసారు.

ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) తప్ప మూవీ టీం మొత్తం హాజరైంది. ఇక ఈ ఈవెంట్‌కి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడిన మాటలు.. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Ram Charan

ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌లో మన తెలుగోడు కూర్చుంటే చాలు అనుకునే వాడినని.. కానీ రాజమౌళి అద్భుతమైన విజన్ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టిందన్నారు. తన మేనల్లుడి కారణంగా మెగా ఫ్యామిలీ రేంజే మారిపోయిందంటూ చెర్రీపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఆ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ జరిగే థియేటర్‌లో రాజమౌళి, కీరవాణి , చంద్రబోస్ , నా మేనల్లుడు రామ్ చరణ్ (Ram Charan), అలాగే మన అందరీ లవబుల్ హీరో ఎన్టీఆర్ (NTR) ని చూసిన తర్వాత నోటి నుండి మాట రాలేదన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏం సాధించిందో చెప్పేందుకు ఆ పురస్కారం ఒక కొలమానమని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

‘క్షణ క్షణం’ సినిమా ఆడియో విడుదల సమయంలో ఎంఎస్ రెడ్డి సంగీత దర్శకుడిని పేరేంటని అడిగారని.. ఇప్పుడా కీరవాణి గురించి తెలుసుకునేందుకు ప్రపంచం ఉవ్విళ్లూరుతోందన్నారు. ఇక చంద్రబోస్ చెట్టుకు మామిడికాయ కోసినంత ఈజీగా ఆస్కార్ పట్టుకొచ్చారని అల్లు అరవింద్ కొనియాడారు.

Google News