Renu Desai: రేణు దేశాయ్‌కి పవన్ అభిమాని ట్వీట్.. మాట్లాడటం నేర్చుకోమంటూ ఫైర్

Renu Desai Social Media Post

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమాని చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది. అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా తన పిక్స్ పెట్టాలంటూ తన ట్వీట్‌లో రేణు దేశాయ్‌(Renu Desai)ని కోరాడు. అంతటితో ఆగితే విషయం పెద్దది కాకపోయేదేమో కానీ తమకు అకీరాను చూడాలని ఉందని.. తనను అలా దాచడం కరెక్ట్ కాదని తెలిపాడు. తమ అన్న పవన్ కల్యాణ్ కొడుకును చూపించాలంటూ రిక్వెస్ట్ చేశాడు.

దీంతో రేణు(Renu Desai)కి బాగా కోపం వచ్చింది. అకీరా నా కొడుకు. నువ్వు ఒక తల్లికే పుట్టావా? మాట్లాడటం నేర్చుకో అంటూ నెటిజెన్ పై విరుచుకు పడ్డారు.

అంతే.. సదరు నెటిజన్‌కి మద్దతుగా చాలా మంది పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. అనవసరంగా విషయం పెద్దది చేస్తున్నారని.. అతను అన్న దానిలో తప్పేమీ లేదని పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ పెట్టారు. అంతే పవన్ ఫ్యాన్స్ వర్సెస్ రేణు దేశాయ్.. సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది.

Renu Desai Social Media Post

అయితే ఈ సందర్భంగా ఒక మహిళ రేణు దేశాయ్(Renu Desai), సమంత(Samantha)కు మద్దతుగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక హీరో, హీరోయిన్ విడాకులు తీసుకుంటే కేవలం హీరోయిన్ ని తప్పుబడతారని సదరు మహిళ వీడియోలో తెలిపింది. అలాగే రెండో పెళ్లి ప్రకటన చేసిన సమయంలో రేణు దేశాయ్‌ను ఎంతలా ట్రోల్ చేశారనేది కూడా ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. విడాకుల సమయంలో రేణు చాలా సంఘర్షణకు గురయ్యారని తెలిపారు. ఈ వీడియో గురించి రేణు మాట్లాడుతూ.. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని.. కానీ ఆమె మాట్లాడుతున్న మాటలు వింటుంటే తనకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు. ఆమె పోస్ట్ వైరల్ గా మారింది.

Google News