Alia Bhatt: ఉపాసన సీమంతం వేడుకకు ఆలియా సర్‌ప్రైజ్ గిఫ్ట్

Alia Bhatt gift to Upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) దంపతులు ఇటీవల ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాము తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నామని చెప్పి తమ కుటుంబ సభ్యులనే కాదు.. ఫ్యాన్స్‌ను సైతం ఖుషీ చేశారు. అయితే ఇటీవలే ఉపాసన (Upasana) సీమంతం దుబాయ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఉపాసన (Upasana) సీమంతానికి బాలీవుడ్ బ్యూటి ఆలియా (Alia Bhatt) సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ పంపించింది. ఈ ముద్దుగుమ్మ ఆర్ఆర్ఆర్ మూవీలో నటించడంతో చెర్రీతో మంచి స్నేహం ఏర్పడింది.

ఉపాసన స్నేహితులు దుబాయ్‌లో సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉపాసన(Upasana) సీమంతానికి ఆలియా హాజరైంది. ఈ సందర్భంగా ఉపాసనకు ఆలియా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తన క్లాతింగ్ షోరూమ్ అయినా Ed-a-mamma నుంచి ప్రెగ్నెన్సీకి సంబంధించిన డ్రెస్సులు అలాగే పుట్టబోయే బేబీకి సంబంధించిన డ్రెస్ లను అలియా భట్ (Alia Bhatt) గిఫ్ట్ గా పంపించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Upasana Konidela

చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌(NTR)లతో ఆలియా ఆర్ఆర్ఆర్ తర్వాతి నుంచి టచ్‌లో ఉంటూనే వస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ పిల్లలు ఇద్దరికీ కూడా తన క్లాతింగ్ షో రూం నుంచి బట్టలు పంపించింది. ఇక తాజాగా ఉపాసన(Upasana)కు పంపించిన గిఫ్ట్ గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆమెకు థాంక్స్ చెప్పి.. అలాగే మళ్లీ చెర్రీతో తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తావని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఉపాసన సీమంతం (Upasana Baby Shower) వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.