Shakeela: ఇప్పుడు షకీలా పేరు మరోసారి మారుమోగుతోంది.. ఎందుకంటే..

Shakeela

నటి షకీలా(Shakeela) వెండితెరపై మెరిసి ఒక సెన్సేషన్ సృష్టించారు. మలయాళ పరిశ్రమకు చెందిన షకీలా టాలీవుడ్‌లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక మాలీవుడ్‌లో అయితే కొంతకాలం పాటు ఆమె హవా కొనసాగింది. ఆమె సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉందంటే కొన్ని చిత్రాలు విడుదలకు వెనుకడుగు వేసేవట. ఆమె అడల్ట్ చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. మొత్తానికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అలాగే కొన్ని ప్రధాన పాత్రల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు.

తెలుగులో కొబ్బరి మట్ట(Kobbarimatta) సినిమా తర్వాత షకీలా అసలు కనిపించలేదు. క్రమక్రమంగా వెండితెరపై షకీలా (Shakeela) హవా తగ్గిపోయింది. వయసు పెరగడం కూడా దీనికి కారణం కావొచ్చు. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక చిన్న ఇంట్లో నివాసముంటున్న వీడియోలు సైతం బయటకు వచ్చాయి. తాజాగా ఆమె మరోమారు లైవ్‌లోకి వచ్చారు. ఓ అపార్ట్‌మెంట్ వాసులకు అండగా నిలవడంతో ఆమె తిరిగి వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షకీలా పేరు మారుమోగుతోంది.

Shakeela

అసలేం జరిగిందంటే.. చెన్నైలోని చూలైమేడు ఏరియాలో గల చిత్ర రెసిడెన్షియల్ అనే అపార్ట్మెంట్ ఉంది. దీనిలో నివసిస్తున్న వారి నుంచి అపార్ట్‌మెంట్ యాజమాన్యం మెయింటెనెన్స్ కింద ఏకంగా రూ.9 వేలు వసూలు చేస్తోందట. కట్టమని చెబితే నీటి సరఫరా నిలిపివేస్తోందట. యాజమాన్యం బాధ భరించలేక అపార్ట్‌మెంట్ వాసులు నిరసనకు దిగారు. అలా అలా పాకుతూ సమస్య షకీలా వరకూ వెళ్లింది. షకీల అపార్ట్‌మెంట్ వాసుల తరుఫున నిలబడటమే కాకుండా.. వారి సమస్యను ప్రభుత్వానికి తెలిసేలా చేశారట. తనకు ఎలాంటి సంబంధం లేకుండా అపార్ట్‌మెంట్ వాసుల తరఫున నిలబడిన షకీలా(Shakeela)పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!