Balagam, Dasara: తెలంగాణోళ్లు తాగుబోతులా? బలగం, దసరా సినిమాలపై ప్రేక్షకులు ఫైర్

Balagam, Dasara Movies

దసరా (Dasara), బలగం (Balagam) సినిమాలు మాంచి హిట్ కొట్టాయి. ఈ విషయంలో ఆనందించాలో లేదంటే.. తెలంగాణ వాళ్లే తీసిన ఈ సినిమాల్లో తెలంగాణ కల్చర్‌ను దారుణంగా చూపించినందుకు బాధపడాలో తెలియక ప్రజానీకం ఆందోళన చెందుతోంది. ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు పురిటి గడ్డగా నిలిచిన తెలంగాణను తాగుబోతులకు అడ్డా అన్నట్టుగా చూపించారని చాలా మంది కలత చెందుతున్నారు. ఘన చరిత్ర కలిగిన తెలంగాణ సినిమాల్లో మాత్రం చీప్‌గా చూపిస్తున్నారన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది.

ప్రత్యేక తెలంగాణ (Telangana) ఏర్పడిన తరువాత ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. అంతకు ముందు తెలంగాణ నటీనటులు కేవలం కమెడియన్లు గానో.. లేదంటే విలన్లుగా మాత్రమే తీసుకునే వారు. ఈ పరిస్థితుల నుంచి కొంతమేర బయటపడ్డాం. కానీ ఇటీవల రిలీజైన ‘బలగం’, ‘దసరా’ (Dasara Movie) సినిమాల్లో తెలంగాణ అంటే తాగుబోతుల అడ్డా అన్నట్టుగా చిత్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలగం సినిమాకు ఈ మధ్య కాలంలోనే దక్కనంత గౌరవం దక్కింది. ఊరారా ప్రొజెక్టర్లు వేసుకుని మూవీ చూడటమనేది గడిచిపోయిన జమానా. కానీ బలగం సినిమాకు తిరిగి ఆ గౌరవం దక్కింది.

Balagam movie scene

ఇక దసరా మూవీ (Dasara Movie) ఇండస్ట్రీ రికార్డు తిరగేస్తుంది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ రెండు సినిమాలను తీసింది తెలంగాణ (Telangana) డైరెక్టర్లే కావడం విశేషం. అయితే ఈ రెండు సినిమాల్లో మద్యం గురించి ఎక్కువగా పెట్టారు. బలగం సినిమా విషయానికి వస్తే.. అత్తారింటికి వచ్చిన అల్లుడికి ముక్క, చుక్క లేదన్న కోపంతో బంధాలే తెంపుకుంటారని చూపించారు. ఇక దసరా మూవీ అయితే మరో మెట్టు ఎక్కింది. పిల్లల నుంచి ముసలోళ్ల వరకూ తాగుబోతులుగానే చిత్రీకరించారు. ఏపీ అనగానే పచ్చని పొలాలు, అందమైన నదులు, కొబ్బరి తోటలు ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని చూపిస్తారని.. అదే తెలంగాణను మాత్రం గొప్పగా చూపించరని ఇక్కడి ప్రజానీకం ఫైర్ అవతోంది. ఇప్పటికైనా ఇండస్ట్రీలో మార్పు రావాలని కోరుకుంటోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!