Dil Raju: ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది? దిల్ రాజు మాటల వెనుక మర్మమేంటి?

Producer Dil Raju

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోల మధ్య వార్ ఉండేదని టాక్. ఇప్పటికీ కూడా అంతర్లీనంగా ఉంది. అయితే దర్శకులు, నిర్మాతల మధ్య వార్ అయితే మనం గతంలో ఎన్నడూ చూడలేదు. మరి ఇప్పుడు చూస్తున్నామా? అంటే స్పష్టంగా చూస్తున్నాం. దీనికి సాక్ష్యం దిల్ రాజు (Dil Raju) తాజాగా చేసిన స్టేట్‌మెంటే. తనకి వస్తున్న పేరుని చూసి ఓ బ్యాచ్ తట్టుకోలేకపోతోందని.. వెంటనే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారని.. తాను నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అసలు దిల్ రాజు(Dil Raju) ఆ స్టేట్‌మెంట్ ఇవ్వడానికి కారణమేంటి? ఇండస్ట్రీలో ఏం జరుగుతోందనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి సంక్రాంతి సమయం నుంచి కూడా ఇండస్ట్రీలో విభేదాలున్నాయనే విషయం బయటకు వచ్చింది. ‘వారసుడు’ సినిమా విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. నిజానికి సినిమాల విడుదల తర్వాత అంతా కూల్. కావాలని దిల్ రాజు(Dil Raju) ‘వారసుడు’ (Varasudu)ని థియేటర్లలోకి తీసుకురావడం ఇష్టం లేక చేసిన రచ్చగానే కనిపిస్తోంది. అసలు దిల్ రాజు ఏం చేసినా సెన్సేషనల్ గానే మారుతోంది.

అయితే ఒక రకంగా నిర్మాతల మధ్య ఆధిపత్య పోరుకు బాటలు వేసింది మాత్రం దిల్ రాజేనని చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతి ముగిసీ ముగియక ముందే వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే సినిమాలను ప్రకటించేసి ఎర్ర బస్సులో కర్చీఫ్ వేసిన మాదిరిగా వేసేసి రిలాక్స్ అవుతున్నారు నిర్మాతలు. అలాగే వచ్చే ఏడాది సీజన్‌ను బేస్ చేసుకుని తమ సినిమాల డేట్లను ప్రకటించేస్తున్నారు. ఇలాంటి ఒక ట్రెండ్‌నున మునుపెన్నడూ మనం చూసింది లేదు. అయితే తన వెనుక తనను వెన్నుపోటు పొడుస్తున్నది ఎవరనే విషయం మాత్రం దిల్ రాజు(Dil Raju)కు స్పష్టంగా తెలుసు. అయితే దిల్ రాజుకు వ్యతిరేకంగా ఫామ్ అయిన బ్యాచ్ ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!