Jr Ntr Vs Balakrishna : ఎన్టీఆర్‌ను బాలయ్య ఘోరంగా అవమానించారా..!?

jr ntr vs balakrishna

టాలీవుడ్ సినీ నటుడు తారకరత్న (Tarakaratna) పెద్ద కర్మ కార్యక్రమం ఇటీవల ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విషాద కార్యక్రమంలో హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్‌రామ్‌ (Kalyanram)కు ఘోర అవమానం జరిగిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు, ఫొటోలు చూసిన ఎన్టీఆర్ వీరాభిమానులు.. బాలయ్య (Balakrishna)ను తిట్టిపోస్తున్నారు. అయినా బాలయ్య (Nandamuri Balakrishna)కు ఇలా అవమానించడం కొత్తేమీ కాదని.. ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. నిన్న, మొన్నటి వరకూ బాబాయ్, అబ్బాయ్ బాగున్నారుగా అప్పుడే మళ్లీ ఏమైందని కొందరు బాలయ్య అభిమానులు సైతం మండిపడుతున్నారు.

అసలేం జరిగింది..?

తారకరత్న (Tarakaratna) పెద్ద ఖర్మ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఎన్టీఆర్ (jr NTR), కల్యాణ్ రామ్ (Kalyanram) ఇద్దరూ బాలయ్య కంటే ముందుగానే వెళ్లి కూర్చొని ఉన్నారు. అయితే ఇంతలో బాలకృష్ణ ఎంటరయ్యారు. ఆయన రాగానే కూర్చొని ఉన్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఇంకా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు వెంటనే లేచారు. ఎన్టీఆర్ (NTR) అయితే బాబాయ్‌ను చూసి చేతులు కూడా కట్టుకున్నారు. అటు, ఇటు ఉన్నవాళ్లని బాలయ్య పలకరించారు కానీ కనీసం ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ను పలకరించకపోగా.. కనీసం కన్నెత్తికూడా చూడలేదు. అక్కడున్న అందర్నీ పలకరించిన బాలయ్య.. ఎన్టీఆర్ బ్రదర్స్‌ను పలకరించకపోయే సరికి ఇద్దరూ అదోలా ముఖం పెట్టారు. ఆఖరికి తారకరత్న(Tarakaratna) చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఎన్టీఆర్ వెళ్లినప్పుడు కూడా.. బాలయ్య పక్కనే ఉన్నారు.. కానీ ఈసారి కూడా కనీసం అటు వైపుగా కూడా చూడలేదు. అయితే కార్యక్రమానికి వచ్చిన పెద్దలను పలకరించే పనిలో సొంత కుటుంబ సభ్యులే కదా అని పలకరించి ఉండకపోవచ్చంతే.. దీనికే ఇంత రాద్ధాంతం చేస్తున్నారెందుకని కొందరు బాలయ్య అభిమానులు నెట్టింట్లో సర్దిచెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

ఈ రెండు వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ (Jr NTR) వీరాభిమానులు అయితే ఇదేందయ్యా బాలయ్యా అంటూ తమ నోటికి బుద్ది చెప్పి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘తారక్ (NTR), కల్యాణ్ రామ్ (Kalyanram) ఇద్దరూ గోల్డ్ అబ్బా. ప్యూర్ర్ హార్ట్.. కల్మషం లేని వాళ్ళు. అంతగా లేచి గౌరవం ఇచ్చినా బాలయ్య కనీసం పలకరించలేదు. నాకే గనుక బాబాయ్ ఉండుంటే ఇలాగే నాతో బిహేవ్ చేస్తే.. ఆ నెక్స్ట్ సెకండ్ కాశీ వెళ్లి బాబాయ్‌కి పిండం పెట్టేస్తా.. చీ ఇలాంటి బాబాయ్ శత్రువుకి కూడా వద్దు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒకట్రెండు కాదు వందలమంది జూనియర్ వీరాభిమానులు చిత్రవిచిత్రాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అటు బాబాయ్ నుంచి.. ఇటు అబ్బాయ్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Google News