Manchu Manoj Wedding: మంచు మనోజ్ పెళ్లి.. ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ రాలేదెందుకు?

Manchu Manoj - Bhuma Mounika Wedding

మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj Wedding) వేడుక ఫిల్మ్‌నగర్‌లోని మంచు వారి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తె అయిన భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy)ని మంచు మనోజ్ పెళ్లాడారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. మౌనికను ప్రేమించిన మంచు మనోజ్.. ఇప్పుడు ఆమె మెడలో మూడుముళ్లు వేసి భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు.

Manchu Manoj - Bhuma Mounika Wedding

పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ మరి పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలెందుకు? అంతేనా.. మోహన్‌బాబు (Mohan Babu)కు సైతం ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఈ పెళ్లికి హాజరు కావడం లేదని పుకారు షికారు చేసింది. లాస్ట్ మినిట్ వరకూ కూడా మోహన్‌బాబు పెళ్లికి హాజరుకారనే అనుకున్నారంతా. కానీ ఆయన వచ్చి దగ్గరుండి మరీ ఈ వివాహం జరిపించి పుకార్లకు చెక్ పెట్టారు.

Manchu Manoj - Bhuma Mounika Wedding

అయితే మరి ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా ఈ (Manchu Manoj – Bhuma Mounika Reddy) పెళ్లి కి హాజరు కాలెందుకనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. కనీసం అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈ పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. వీరంతా ఎందుకు హాజరు కాలేదు? అసలు పెళ్లికి మనోజ్ (Manchu Manoj) కుటుంబం అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్‌ని, ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరినీ పిలవలేదా? లేదంటే కావాలనే ఎవరూ రాలేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!