Star Hero: బెడ్ రూమ్‌కి వచ్చి ఫోటోలు తీసుకోండి.. స్టార్ హీరో ఆగ్రహం.. !

Star Hero Angry on Photographer

మీడియా ఈ మధ్య కాలంలో మరీ ఓవర్‌గా వ్యవహరిస్తోంది. కంటెంట్ కోసం ఎంతకైనా దిగజారేందుకు వెనుకాడటం లేదు. బాలీవుడ్ హీరో ఈ మీడియాతో ఎంతలా అసహనానికి గురయ్యారో ఏమో కానీ ఇప్పుడు మీడియాపై ఆయన మండిపడిన తీరు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. మలైకా అరోరా (Malika Arora) తల్లి బర్త్‌డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాత్రి కరీనా- సైఫ్ (Kareena Kapoor – Saif Ali Khan) తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. 

ఆ సమయంలో సైఫ్ జంటను మీడియా ఫోటోగ్రాఫర్‌లు ఫాలో అవుతూ సర్ ఒక ఫొటో ప్లీజ్ అంటూ కోరారు. కానీ అటు కరీనా (Kareena Kapoor), ఇటు సైఫ్ (Saif Ali Khan) ఇద్దరూ ఫోటోగ్రాఫర్లు అడిగిన ప్రశ్నకు ఏమాత్రం స్పందించలేదు. కానీ వారు మళ్లీ మళ్లీ అడిగి విసిగించడంతో సైఫ్‌కు కోపం తన్నుకు వచ్చింది. దీంతో సైఫ్ కోపంతో.. ‘ఒక పని చేయండి, మా బెడ్‌రూమ్‌కు వచ్చి తీసుకోండి’ అంటూ ఒకింత వెటకారంతో మాట్లాడారు. 

Star Hero Saif Ali Khan Angry on Photographer

ఈ మాటలతో రిపోర్టర్లు అవాక్కయ్యారు. వెంటనే ఒకరు తేరుకుని ‘సైఫ్ సర్.. మీరంటే మాకు చాలా ఇష్టం’ అని చెప్పారు. దీనికి సైఫ్ (Saif Ali Khan) కూడా ‘మాకు కూడా మీరంటే ఇష్టమే’ అని అని చెప్పి కరీనా (Kareena Kapoor)ను తీసుకుని లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లకీ పర్సనల్ లైఫ్ అనేది ఒకటుంటుంది కదా అని కొందరు.. సెలబ్రెటీలకు ఆ హోదా, ప్రచారం కల్పిస్తుంది మీడియా కదా.. అలాంటి వాళ్లపై వెటకారం ఆడాల్సిన అవసరం ఏముందంటన్నారు.

Google News