ప్రభాస్ కి ఇప్పుడు రాజమౌళి అక్కర్లేదు
ప్రభాస్ నెంబర్ వన్ హీరో. ఎవరూ అతనికి ఈ ట్యాగ్ ఇవ్వడం లేదు కానీ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా చెప్తోంది అతనే నంబర్ వన్ హీరో అని.
తాజాగా “కల్కి 2898 AD” సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్ల మార్క్ ని దాటింది. 1000 కోట్ల వసూళ్ల సినిమాల జాబితాలో అత్యధికంగా ప్రభాస్ కే ఉన్నాయి. తెలుగులో మరో హీరోకి ఇలాంటి రికార్డులు లేవు.
ఇక హిట్ కొట్టాలన్నా, రికార్డులు సృష్టించాలన్నా తనకు ప్రతిసారి రాజమౌళి అవసరం లేదనే విషయాన్ని “కల్కి 2898AD” సినిమాతో అందరికీ చెప్పాడు. ఏ దర్శకుడితోనైనా రికార్డులు సృష్టించేంత స్టార్ పవర్ తనకు ఉందని చాటిచెప్పాడు.
కపై ప్రభాస్ కెరీర్ ను బాహుబలి-2కు ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చివరికి కల్కి సినిమాతో కూడా అలాంటి పోలిక అవసరం లేదు. ఎందుకంటే, ప్రభాస్ స్థాయి వేరు. అతడు ఏ సినిమా చేసినా, దానికో బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు, సినీ చరిత్రలో ఓ మైలురాయిగా మారుస్తున్నాడు.
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ కెరీర్ ట్రాక్ తప్పింది. సలార్ తో అది మళ్లీ పట్టాలపైకి వచ్చింది. ఇప్పుడు కల్కి సినిమాతో పట్టాలపై పరుగులుపెడుతోంది.