నిద్ర పట్టట్లేదు అంటోన్న నేహా శెట్టి

Neha Shetty

తన అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది నేహా శెట్టి. డీజే టిల్లులో రాధికగా ఈ భామ చేసిన హంగామా అట్లాంటిది మరి. తాజాగా ఈ భామ తనకు నిద్ర పట్టట్లేదు అని చెప్తోంది.

కొత్తగా నేహా శెట్టి ఒక ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ “మీరు కూడా నాలా నిద్ర పోలేకపోతున్నారా?” అంటూ తన అభిమానులను ప్రశ్నించింది.

దానికి కుర్రాళ్ళు కొంటెగా సమాధానాలు ఇచ్చారు. “నువ్వు ఇలా ఫోజులు ఇస్తూ కవ్విస్తే నిద్ర ఎలా పడుతుంది?” ఒకరు సమాధానం ఇవ్వగా, “పెళ్లి చేసుకో మంచిగా నిద్ర పడుతుంది” అని ఇంకొకరు రిప్లై ఇచ్చారు. “నేహా శెట్టి నువ్వు మా నిద్ర పోగొట్టువు పో” అంటూ కొందరు లవ్ సింబల్స్ పెట్టారు.

Neha Shetty

నేహా శెట్టి ఇటీవల “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, “టిల్లు స్క్వేర్” వంటి సినిమాల్లో కనిపించింది.

స్లిమ్ గా, సెక్సీగా కనిపిస్తూ కుర్రాళ్ళ మతి పోగెట్టే నేహా శెట్టి ప్రస్తుతం ఒక టాలీవుడ్ హీరోతో లివిన్ రిలేషన్ షిప్ లో ఉందని గుసగుస.