‘ఆల్ఫా’కి కిక్ కొట్టిన ఆలియా భట్‌

Alia Bhatt

బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ ఏడాది కింద ఒక పాపకి జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు ఆలియా భట్‌ మళ్ళీ యాక్షన్ మొదలు పెట్టింది. కెరీర్ లో మొదటిసారిగా గూఢచారిణిగా నటిస్తోంది.

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘ఆల్ఫా’ సినిమాలో ఆమె ఇలా కనిపించనుంది. తాజాగా షూటింగ్‌ మొదలుపెట్టారు. అత్యంత భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది “ఆల్ఫా” .

ఆమె మొదటి రోజు సెట్స్ కి హాజరయిన ఫోటో ఇప్పుడు వైరల్‌ అయింది. సినిమాలో ఆమె లుక్‌ ఇది కాదు. ఈ సినిమాలో ఆమె లుక్‌ ఎవరి ఊహకి అందనంత కొత్తగా ఉంటుందట. కానీ షూటింగ్ కి వచ్చినప్పుడు క్లిక్‌మనిపించిన లుక్కే ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి హీరోలతో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై సినిమాలు భారీగా నిర్మించింది. ఇప్పుడు మొదటిసారిగా పెద్ద హీరోయిన్ తీసుకొని లేడి ఓరియెంటెడ్ స్పై సినిమా నిర్మిస్తోంది. అదే ‘ఆల్ఫా’.

ఇందులో ఆలియా సూపర్‌ ఏజెంట్‌గా కనిపిస్తుంది. శివ రవైల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ లో ఇంతకు ముందు ‘ది రైల్వే మెన్‌’ అనే వెబ్ సిరీస్ ని డైరక్ట్ చేసిన ఘనత శివ రవైల్‌ది.

ఒక వైపు ఆలియా భట్ భర్త “రామాయణం” వంటి భక్తి సినిమాల్లో నటిస్తుండగా ఆమె ఇలా యాక్షన్ సినిమాలు చేస్తోంది.

Google News