కమల్ హాసన్, సిద్ధార్థ్ … గురుశిష్యులు!

కమల్ హాసన్, సిద్ధార్థ్ … గురుశిష్యులు!

క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం “భార‌తీయుడు 2”. ఈ సినిమాలో సిద్ధార్థ్ కూడా హీరోగా నటించాడు. దర్శకుడు శంకర్ ఈ సినిమాని “భార‌తీయుడు 2”, “భారతీయుడు 3” అని రెండు భాగాలుగా తీశారు.

“భారతీయుడు 2″లో కమల్ హాసన్ చాలా తక్కువగా కనిపిస్తారు అని అంటున్నారు. సినిమాలో ఎప్పుడో చివర్లో మాత్రమే కమల్ హాసన్ సీన్ లోకి వస్తారని టాక్ నడుస్తోంది. అందుకే, కమల్ హాసన్ తనకు గురువు అని సిద్ధార్థ్ అంటున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కమల్ మాత్రం అదంతా ఉత్తిదే అని చెప్తున్నారు.

“భారతీయుడు 2లో సాంగ్, ఫైట్స్ ఉన్నాయా అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు. అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. నేను గురువు అని సిద్దార్థ్ ప్రతీ సారి చెబుతుంటాడు. అవే మాటలు నేను శివాజీ గణేశన్ గారికి చెబుతుండేవాడిని. సిద్దార్థ్, నేను ఒక ఏకలవ్య శిష్యులం. ఇంకా కమల్ హాసన్ లాంటి వారు రావాలి.. సిద్దార్థ్ లాంటి వారు వస్తూ ఉండాలి. ఇండస్ట్రీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.” అని కమల్ అన్నారు.

“భారతీయుడు 2 చిత్రాన్ని అందరూ వీక్షించండి. ఈ సినిమాలోని మెసెజ్ అందరికీ చేరాలి,” అని కమల్ హాసన్ కోరారు.