వెంకీ.. ఈసారి సోలోగానే

వెంకీ.. ఈసారి సోలోగానే

అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అయ్యారు వెంకటేశ్. ఈ కాంబినేషన్ లో సినిమా లాంఛింగ్ కూడా ఇటీవల పూర్తయింది. ఆ లాంఛింగ్ తో పాటే పుకార్లు కూడా ఊపందుకున్నాయి.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేశారు వెంకీ. ఆ రెండూ మల్టీస్టారర్ మూవీసే. కాబట్టి వీళ్ల కాంబోలో రాబోతున్న మూడో సినిమా కూడా మల్టీస్టారర్ అని, ఓ పెద్ద హీరో ఇందులో నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారాన్ని అనీల్ రావిపూడి తిప్పికొట్టాడు. తమ కొత్త సినిమాలో వెంకీ మాత్రమే హీరో అని, మరో హీరోకు చోటు లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా మూవీ విడుదలపై మరోసారి విస్పష్ట ప్రకటన చేశాడు. చిరంజీవి విశ్వంభరతో పాటే, వెంకీ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని తెలిపాడు.

ఈ సినిమాలో వెంకీకి భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటించనుంది. ఇక అతడి మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనుంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.

Google News