రాజ్ తరుణ్ రాజీకి ట్రై చేశాడా?

రాజ్ తరుణ్ రాజీకి ట్రై చేశాడా?

హీరో రాజ్ తరుణ్, అతడి ప్రేయసి లావణ్య మధ్య నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడిందులో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ వివాదాన్ని తెరవెనక పరిష్కరించుకునేందుకు రాజ్ తరుణ్ గట్టిగా ప్రయత్నించాడంట.

“రాజ్ తరుణ్ నాతో డైరక్ట్ గా చెప్పాడు. మీడియా ముందుకు వెళ్తే నేను పూర్తిగా యాంటీ అవుతానని బెదిరించాడు. కూర్చొని మాట్లాడుకుందాం, కాంప్రమైజ్ అవుదాం అన్నాడు. అలా చేస్తే తన ఇల్లు రాసిస్తానన్నాడు, ప్రతి నెల మెయింటెనెన్స్ కూడా ఇస్తానన్నాడు. ఇల్లు, డబ్బు కోసమైతే నేను మీడియా ముందుకు వచ్చేదాన్ని కాదు కదా. నాకు నా రాజ్ కావాలి.”

రాజ్ తరుణ్ రాజీకి ట్రై చేశాడా?

ఇలా రాజ్ తరుణ్, రాజీకి ప్రయత్నించిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటపెట్టింది లావణ్య. రాజ్ తరుణ్ లేకుండా తను బతకలేనని.. తను ముసలిదాన్ని అయిపోయినా అతడే నాకు కనిపిస్తాడు, అతడ్నే ప్రేమిస్తూ ఉంటానని అంటోంది.

మాల్వీ మల్హోత్రాతో అతడు ఎఫైర్ లో ఉన్నాడని మరోసారి ఆరోపించింది లావణ్య. ఈ మేరకు చెన్నైకు చెందిన ఓ హోటల్ డీటెయిల్స్ బయటపెట్టింది. అంతేకాదు, మాల్వి కోసం రోజుకు 70వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని కూడా ఆరోపించింది. ఆమె కోసం పొద్దున్నే ముంబయి వెళ్లి, తిరిగి రాత్రికి వస్తున్నాడని అంటోంది.

Google News