Rama Rajamouli: రమా రాజమౌళి మొదటి భర్త స్టార్ మ్యూజిక్ డైరెక్టరట..

Rama Rajamouli

తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన పేరు గ్లోబల్ వైడ్‌గా మారు మోగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడమే కాకుండా దీనిని ఆస్కార్ రేసులో నిలిపి అవార్డు కూడా అందుకున్నారు. అసలు రాజమౌళి(Rajamouli) ఫ్లాప్ అంటే ఏంటో కూడా ఇప్పటి వరకూ తెలియదు. ఇక ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్ట్రీ ఉంటుందంటారు. అలాగే రాజమౌళి సక్సెస్ వెనుక ఆయన భార్య రమ (Rama) ఉన్నారనడంలో సందేహంలో లేదు.

రాజమౌళి(Rajamouli).. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి భార్య సోది రమణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రమకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమైన శాంతి నివాసం సీరియల్ రూపొందించే సమయంలో రాజమౌళికి రమ(Rama Rajamouli)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే మరి రమ(Rama Rajamouli).. మొదటి పెళ్లి ఎవరితో జరిగిందనే విషయమై ఇప్పుడు ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.

Rama Rajamouli

ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ని రమ(Rama Rajamouli) తొలుత వివాహం చేసుకున్నారట. ఆ వివాహాన్ని కీరవాణి(Keeravani) తన చేతుల మీదుగానే జరిపించారట. అయితే అతను మంచి వాడు కాదని పెళ్లి తర్వాత రమ(Rama Rajamouli)కు తెలిసిందట. విషయం తెలుసుకుని కీరవాణి కూడా చాలా బాధపడ్డారట. దీంతో విడాకులు ఇప్పించేశారట. అయితే అప్పటికే ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రమను వివాహం చేసుకున్న తర్వాత రాజమౌళి(Rajamouli) ఆ బాబునే తన కుమారుడిగా చూసుకుంటూ పిల్లల కోసం ప్లాన్ కూడా చేయలేదట. అంత గొప్ప వ్యక్తిని వివాహం చేసుకోవడం రమ(Rama Rajamouli) అదృష్టమనే చెప్పాలి.

Google News