Mahesh Babu: వామ్మో.. మహేష్ బాబు నోట బూతులు వినిపిస్తాయట..

Mahesh Babu in SSMB 28

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమా అంటే చాలా క్లాస్‌గానే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మాస్ అంటే మహేష్‌కి కలిసి రాదేమో అనిపిస్తుంది. ఖలేజా చిత్రమే దీనికి నిదర్శనం. సినిమా పెద్దగా బోర్ ఏమీ కొట్టదు. పైగా మహేష్‌లోని మరో యాంగిల్‌ని పరిచయం చేసిన చిత్రం. అయినా కూడా ఆశించిన ఫలితాలన్నివ్వలేదు. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్, మహేష్ కలిసి సినిమా చేస్తున్నారు. అతడు, ఖలేజా (Khaleja) కమర్షియల్ హిట్ కాకున్నా కూడా మహేష్‌కి అయితే మంచి పేరే తెచ్చిపెట్టాయి.

ఈసారి మహేష్(Mahesh Babu), త్రివిక్రమ్‌ల(Trivikram Srinivas) కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఈ సినిమాలో కొత్త మహేష్ బాబు(Mahesh Babu)ని చూడటం మాత్రం ఖాయమని తెలుస్తోంది. నిజానికి ఖలేజా వరకూ మహేష్ అంత చక్కగా పంచ్‌లు పేల్చి నవ్వించగలడని కానీ గలగలా మాట్లాడగలడని కానీ ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమాతో మహేష్‌పై ఉన్న అభిప్రాయమే మారిపోయింది. ఆ తరువాత మహేష్ కూడా కాస్త స్టైల్‌ని మార్చేశాడు.

ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం(SSMB28)లో మహేష్.. తన యాక్టింగ్ స్టైల్‌ని చూపిస్తాడట. సరికొత్త యాంగిల్‌ని చూడటం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నాడట. ఒక రోల్ క్లాస్.. మరొకటి మాస్. ఇప్పటి వరకూ మహేష్(Mahesh Babu) డ్యుయల్ రోల్‌లో నటించింది లేదు. ఇక ఈ సినిమాలోని మహేష్ మాస్ క్యారెక్టర్ వచ్చేసి బూతులు కూడా మాట్లాడుతుందని టాక్. మొత్తానికి ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!