Samyuktha Menon: వామ్మో! రెమ్యూనరేషన్ పెంచేసిన సంయుక్తా మీనన్

Samyuktha Menon hikes her remunaration

భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్(Samyuktha Menon). అమ్మడికి ఏంటో గానీ కాలం బాగా కలిసొస్తుంది. పట్టుకున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్సే. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న సంయుక్తా మీనన్ తన తదుపరి చిత్రం బింబిసార(Bimbisara)తో మరింత ఆకట్టుకుంది. ఇక సార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సక్సెస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక విరూపాక్ష(Virupaksha) సక్సెస్ టాక్‌తో ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ లెగ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej)తో కలిసి నటించిన సినిమా విరూపాక్ష థియేటర్స్‌లో సందడి చేస్తోంది. ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాంచి సక్సెస్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది. అయితే సంయుక్తా మీనన్(Samyuktha Menon) రెమ్యూనరేషన్ మొన్నటి వరకూ రూ.50 లక్షలు ఉండేదట. దానిని తాజాగా కోటి రూపాయలకు పెంచేసిందట. ఇది చూసిన తర్వాతే అంతా అవాక్కవుతున్నారు. ఇక విరూపాక్ష మూవీ కూడా సక్సెస్ అయ్యింది కాబట్టి ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచేస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Samyuktha Menon in Virupaksha

అయితే విరూపాక్ష(Virupaksha) సినిమాలో అమ్మడికి గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి కానీ సాయి ధరమ్‌(Sai Dharam Tej)తో రొమాన్స్ విషయంలో మాత్రం సెట్ అవలేదని టాక్. కానీ అమ్మడికి అయితే గోల్డెన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కాబట్టి అవకాశాలు క్యూ కడతాయి. స్టార్ హీరోల చూపు అమ్మడిపై పడటం ఖాయం. ఇక విరూపక్ష తర్వాత డెవిల్ చిత్రంతో సంయుక్త ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా హిట్ అయ్యుంతో అమ్మడిని ఆపడం ఎవరి తరమూ కాదని నెటిజన్ల టాక్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!