Samantha: ఇప్పుడా అనారోగ్యమంతా ఎటు పోయింది?: సమంతపై నెటిజన్ల ఫైర్

Samantha ait Citadel London premiere

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవల ఎందుకో గానీ ఎక్కువగా విమర్శలకు గురవుతూ వస్తోంది. యశోద మూవీ హిట్ అయిన సమయంలో ఆమెపై పెద్దగా ట్రోల్స్ ఏమీ లేవు పైగా సింపతీ బాగా ఉండేది కానీ ఇప్పుడు ఎందుకో ట్రోల్స్ బీభత్సంగా మారాయి. అన్ని సమయాల్లో సింపతీ వర్కవుట్ కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని సమంత(Samantha) సింపతీ డ్రామాలు ప్లే చేస్తోందనేది ప్రధాన ఆరోపణ.

ఇక శాకుంతలం(Shaakuntalam) సినిమా ఫ్లాప్‌లో సమంత పాత్ర చాలా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆమె నటన దారుణమని.. కనీసం డబ్బంగ్ కూడా సరిగా చెప్పలేదంటున్నారు. కనీసం శకుంతల పాత్రకు సామ్(Samantha) అస్సలు సూట్ అవలేదని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా ఆమె సరిగా పాల్గొనలేదు. అదేమంటే అనారోగ్యమని చెప్పుకొచ్చింది. మరోవైపు యథావిధిగా తన చిత్రాల షూటింగ్‌లో పాల్గొనేది.

Samantha ait Citadel London premiere

అంతేకాకుండా.. శాకుంతలం(Shaakuntalam) ప్రెస్ మీట్‌లో భాగంగా సామ్(Samantha).. చాలా నీరసంగా కనిపించేది. తాజాగా ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం సామ్ లండన్‌కు వెళ్లింది. ఇక అక్కడ అమ్మడు ఫుల్ యాక్టివ్‌గా కనిపించింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో స్కిన్ షో చేస్తూ సందడి చేసింది. ఇక ఆ ఫోటోలు చూసి నెటిజన్లు ఊరుకుంటారా? లండన్‌కి వెళ్లేసరికి అనారోగ్య సమస్యలన్నీ ఎగిరిపోయాయా? అంటూ ఫైర్ అవుతున్నారు. పబ్లిసిటీ కోసం శాకుంతలం(Shaakuntalam) సినిమా సమయంలో సింపతీ డ్రామాలు ఆడిందని విమర్శిస్తున్నారు. మొత్తానికి మరోసారి సామ్(Samantha) దారుణంగా ట్రోల్ అవుతోంది.

Google News