Shaakuntalam: ‘శాకుంతలం’ ఫ్లాప్‌కు నాగ చైతన్యే కారణం.. అల్లు అర్హ కంటే బాగా చేసే చైల్డ్ ఆర్టిస్టులు..: బిగ్‌బాస్ ఫేం ఆరోహి సంచలనం

Bigg Boss fame Arohi shocking comments on Naga Chaitanya and Allu Arha

ఒక సినిమా ఫ్లాప్‌కు కారణాలు అనేకం ఉంటాయి. అయితే సినిమాతో సంబంధమే లేని వాళ్లని తీసుకొచ్చి సినిమా హిట్ లేదంటే ఫ్లాప్‌కి కారణమని చెప్పలేం. కానీ తెలుగు బిగ్‌బాస్ 6 (Bigg Boss 6) ఫేమ్ మాత్రం ‘శాకుంతలం’(Shaakuntalam) సినిమా ఫ్లాప్‌ని ఒక హీరోకి అంటగట్టేసింది. అమ్మడు నోటిని కంట్రోల్‌లో పెట్టుకోలేకే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ కూడా నాగ చైతన్య(Naga Chaitanya)పై విమర్శలు గుప్పించింది. ఆయన కారణంగానే శాకుంతలం(Shaakuntalam) ఫ్లాప్ అయ్యిందట.

గుణ శేఖర్(Gunasekhar) దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం(Shaakuntalam). తొలి షోతోనే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ మూకుమ్మడిగా నెగిటివ్‌గానే వచ్చాయి. ఇక సినిమాకు సమంత(Samantha) అస్సలు సూట్ అవలేదని.. గ్రాఫిక్స్ దారుణమని ఫలితంగా సినిమా పోయిందని ఆడియన్స్ తెలిపారు. ఆరోహి(Arohi) మాత్రం సినిమా ఫ్లాప్ అవడానికి కారణం నాగ చైతన్యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Bigg Boss fame Arohi shocking comments on Naga Chaitanya and Allu Arha

ఆరోహి(Arohi) మాట్లాడుతూ.. శాకుంతలం సినిమా.. పురాణాల గురించి తెలియని వారికి పంచ తంత్రం కథలాగే కనిపిస్తుందని పేర్కొంది. ఈ చిత్రం ప్లాప్ అవ్వడానికి నాగ చైతన్య(Naga Chaitanya) ఫ్యాన్స్ కూడా కారణమని వెల్లడించింది. సమంత నటన బాగాలేదని వారు చెప్పడం వల్లే సినిమా ఫ్లాప్ అయ్యిందని వెల్లడించింది. సినిమాలో కొంచెం ఫిక్షన్, మసాలా జోడిస్తే హిట్ అయి ఉండేదని తెలిపింది. ఇక అల్లు అర్హ(Allu Arha) గురించి కూడా కాస్త కాంట్రవర్సీ కామెంటే చేసింది. అర్హ బాగానే చేసింది కానీ.. అంత కంటే బాగా చేసే చైల్డ్ ఆర్టిస్టులు బయట అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అని ఆరోహి పేర్కొంది.

Google News