ఆ ఇద్దరూ హీరోయిన్లు తెగ నచ్చేశారంటున్న ఫేమస్ క్రికెటర్

Cricketer Jitesh Sharma

క్రికెటర్‌లకు ఫ్యాన్స్ ఉండకూడదా? అంటే ఎందుకు ఉండకూడదు భేషుగ్గా ఉండొచ్చు. వీరికి ఫిలిం ఇండస్ట్రీతో సత్సంబంధాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లాడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో తొలుత చెప్పుకునేది విరాట్ కోహ్లీ – అనుష్క జంటనే. ఇక ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు కానీ ఓ యువ క్రికెటర్ మాత్రం ఆసక్తికర ప్రకటన చేశాడు. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ హీరోయిన్‌లు అయిన కంగనా రనౌత్(Kangana Ranaut), జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)లపై టీమిండియా యువ క్రికెటర్, పంజాబ్ ప్లేయర్ జితేశ్ శర్మ (Jitesh Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన తోటి టీమ్ మెట్ హర్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఒక చిన్న ఫన్ గేమ్ ఆడాడు జితేశ్. ఈ గేమ్‌లో భాగంగా హర్ ప్రీత్.. జితేశ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడిగాడు. దీనికి సమాధానంగా జితేశ్ చెప్పిన వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. యంగ్ క్రికెటర్ ఇద్దరిపై మనసు పారేసుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Janhvi Kapoor and Kangana Ranaut

కంగనా(Kangana Ranaut), జాన్వీ(Janhvi Kapoor).. ఇద్దరు హీరోయిన్స్‌లో రెండు విషయాలు తనకు తెగ నచ్చేస్తాయని తెలిపాడు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌లు అంటే తనకు చచ్చేంత ఇష్టమని తెలిపాడు. ఇక ఆ ఇద్దరిలో ప్రత్యేకంగా ఏ ఏ విషయాలు నచ్చుతాయో కూడా జితేన్ తెలిపాడు. తనకు నటన పరంగా కంగనా అంటే చాలా ఇష్టమట.. ఇక లుక్ పరంగా అయితే జాన్వీకి చాలా పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవతున్నాయి. ప్రస్తుతం జితేన్ ఐపీఎల్‌లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!