Bro: పవన్ ‘బ్రో’ స్టోరీ ఇదేనట.. కథ పాతదే కానీ..

Bro: పవన్ ‘బ్రో’ స్టోరీ ఇదేనట.. కథ పాతదే కానీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సముద్రఖని(Samuthirakhani) కాంబోలో రూపొందిన చిత్రం ‘బ్రో’(BRO). ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌కు పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తున్నాడు. ఇక పవన్ వచ్చేసి టైంగాడ్‌గా నటించారు.

ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కథ అయితే పాతదిలాగే ఉంది కాబట్టి ఇక ప్రెజెంట్ చేసే విధానం మారితే ఓకే. లేదంటే కష్టమేనని తెలుస్తోంది. అసలు కథ ఏంటంటే.. మార్కండేయ (సాయి ధరమ్ తేజ్) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అంతా బాగుంది.. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళుతున్నాడనే క్రమంలో రోడ్డు ప్రమాదం బారిన పడి మరణిస్తాడు. సాయి ధరమ్(Sai Dharam Tej) ఆత్మని పరలోకానికి తీసుకెళ్లేందుకు వస్తాడు టైంగాడ్ (పవన్ కల్యాణ్).

తన కుటుంబ పరిస్థితి.. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలను టైంగాడ్‌కు వివరించి కొంత కాలం పాటు తనకు జీవితాన్ని ప్రసాదించాలని అర్థిస్తాడు. సాయిధరమ్(Sai Dharam Tej) అభ్యర్థనకు కరిగిపోయిన టైం గాడ్ సమయం ఇచ్చేసి అతనితో పాటు అతని ఇంటికి వెళతాడు. ఆ తరువాత స్టోరీ ఏ మలుపు తీసుకుంటుంది? అనేదే కథ. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా ఉంటాయట. ప్రేక్షకులను మెప్పించాలే కథనం ఉంటే ఓకే కానీ లేదంటే మూవీ అట్టర్ ఫ్లాపేనని నెటిజన్లు అంటున్నారు.