Vishnu Manchu: వెన్నెల కిషోర్ వద్ద గుట్టలు గుట్టలుగా రూ.2 వేల నోట్లు.. బయటపెట్టిన మంచు విష్ణు

Vishnu Manchu: వెన్నెల కిషోర్ వద్ద గుట్టలు గుట్టలుగా రూ.2 వేల నోట్లు.. బయటపెట్టిన మంచు విష్ణు

రెండు వేల రూపాయల నోట్లను ఆర్‌బీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనాలు ఎక్కడెక్కడో దాచిన నోట్లను బయటకు తీసి వాటిని మార్చుకునే పనిలో పడ్డారు. సెప్టెంబర్‌లోగా తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లు అన్నింటినీ మార్చేసుకోవాలి. అది కూడా రోజుకు 10 నోట్లను మాత్రమే మార్చుకోగలం. కోట్లలో నల్లధనం దాచుకున్న వారి పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఫేమస్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాడు.

వెన్నెల కిషోర్(Vennela Kihsore) ఇంట్లో కుప్పలు తెప్పలుగా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయట. వాటిని మంచు విష్ణు ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాటిని వెన్నెల కిషోర్(Vennela Kihsore) ఇంట్లో చూశానని పోస్ట్ పెట్టాడు. ఇప్పుడివన్నీ వెన్నెల కిషోర్ ఏం చేసుకోబోతున్నాడని ఆయన సరదాగా పేర్కొన్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వెన్నెల కిషోర్ తెగ సంపాదించేశాడని మంచు విష్ణు(Manchu Vishnu) చెప్పకనే చెప్పాడు. దీనిపై వెన్నెల కిషోర్ స్పందించాల్సి ఉంది.

ఇక అసలు విషయాన్ని పక్కనబెట్టిన నెటిజన్లు మంచు విష్ణు(Manchu Vishnu)పై పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. తాజాగా మనోజ్(Manchu Manoj) బర్త్‌డే వచ్చింది. తనకు విష్ణు విషెస్ చెప్పలేదు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ్ముడు మనోజ్‌(Manchu Vishnu)కి బర్త్ డే విషెస్ చెప్పడం రాదు కానీ ఈ పనికి మాలిన కామెడీలు ఏంటంటూ మండి పడుతున్నారు. మంచు లక్ష్మి(Manchu Lakshmi) మాత్రం ఓ ఎమోషనల్ వీడియోతో మనోజ్‌(Manchu Manoj)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆకట్టుకుంది.