BRO Motion Poster: ‘బ్రో’ మోషన్ పోస్టర్‌లో పవన్ వేసుకున్న టీ షర్ట్, షూ గమనించారా?

BRO Motion Poster: ‘బ్రో’ మోషన్ పోస్టర్‌లో పవన్ వేసుకున్న టీ షర్ట్, షూ గమనించారా?

పవన్ కల్యాణ్(Pawan Kalyan), సముద్ర ఖని(Samuthriakhani) కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘బ్రో’(BRO). ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తొలిసారిగా పవన్‌(Pawan Kalyan)తో కలిసి ఈ చిత్రంలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సందడి చేయబోతున్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్(Sai Dharam Tej) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటించాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో మరోసారి పవన్ కల్యాణ్(Pawan Kalyan) దేవుడిగా కనిపించనున్నాడు. 

తాజాగా చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్(BRO Motion Poster) విడుదలయ్యాయి. వీటిని చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు. చాలా కాలం తర్వాత పవన్‌ను ఇంత స్టైలిష్ లుక్‌లో చూస్తున్నామని అంటున్నారు. అయితే మోషన్ పోస్టర్‌(BRO Motion Poster)ను నిశితంగా గమనిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్లాక్ షూస్ , బ్లాక్ డ్రెస్ వేసుకొని రెండు చేతులు స్టైల్ గా చాపుతూ నిలబడినట్టుగా మోషన్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

ఈ మోషన్ పోస్టర్ చూస్తే జల్సా మూవీ స్టిల్ ఒకటి గుర్తుకు రావడం ఖాయం. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. పవన్(Pawan Kalyan) ధరించిన షూస్‌కి పాములు ఉండటం. దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే గమనించి ఉంటారు. ఇక పవన్ వేసుకున్న టీ షర్ట్‌పై కూడా శివుని బొమ్మ కనిపిస్తోంది. స్వయంగా పరమశివుడే కాలుడి రూపంలో భూలోకంలోకి వచ్చినట్టుగా పవన్‌ను చూపించబోతున్నట్టు ఈ మోషన్ పోస్టర్‌ని అర్థమవుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!