Samantha: ఇక తన కంటే చిన్న వాడైన హీరోతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్న సమంత..

Samantha: ఇక తన కంటే చిన్న వాడైన హీరోతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవలి కాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. కథలో దమ్ముండాలే కానీ అమ్మడు ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే అంటోంది. మరోవైపు స్పెషల్ సాంగ్స్ అవకాశం వచ్చినా వదట్లేదు. ఇక నెగిటివ్ పాత్రలకు సైతం సై అంటోంది. గతంలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2(Family Man Season 2) వెబ్ సిరీస్‌లో నెగటివ్ రోల్ చేసింది. అమ్మడు పాన్ ఇండియా స్టాయిలో ఈ నెగిటివ్ రోల్‌తో పాపులర్ అయిపోయింది.

ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకుడితోనే సిటాడెల్(Citadel) అనే వెబ్ సిరీస్ చేస్తోంది సమంత(Samantha). అమ్మడు ఈ మధ్య ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తోంది కదా. ఈ క్రమంలోనే సిటాడెల్‌లో రా ఏజెంట్‌గా కనిపించబోతోంది. ఇక తన కంటే చిన్న వాడైన హీరోతో రొమాన్స్‌కు సామ్ సిద్ధమవుతోంది. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో(Siddhu Jonnalagadda) కలిసి ఓ సినిమా చేయబోతోంది. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా సమంత(Samantha Ruth Prabhu) నటిస్తోందని టాక్. ఈ సినిమాకు నందినీ రెడ్డి(Nandini Reddy) దర్శకత్వం వహిస్తున్నారట.

ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్(DJ Tillu Square) సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సమంతతో సినిమా పట్టాలెక్కించనున్నారని టాక్. ఇక ప్రస్తుతం సమంత(Samantha) కూడా బిజీగానే ఉంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో ఖుషీ(Kushi) అనే చిత్రంలో అమ్మడు నటిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!