RGV: యాంకర్‌గా మారిన వర్మ.. ఇంకెన్ని కోణాలు చూడాలో..

RGV: యాంకర్‌గా మారిన వర్మ.. ఇంకెన్ని కోణాలు చూడాలో..

ఇంతకన్నా దిగజారేందుకు ఏం లేదు అనుకున్నప్పుడల్లా అది తప్పని నిరూపిస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎవరైనా తమ కెరీర్ డౌన్ అవుతోంది అనుకున్నప్పుడు గౌరవంగా తప్పుకుంటారు కానీ వర్మ(RGV) అలా కాదు.. తన స్థాయి నుంచి కింది లెవల్‌కు వెళ్లి మరీ ఏదో ఒకటి చేస్తుంటారు. అలా ఇప్పటికి ఎన్నో స్టెప్స్ దిగి వచ్చారు. ఇక దిగడానికి ఇంకేమీ లేదు అనుకునేంత వరకూ ఇలా చేస్తూనే ఉంటారేమో చూడాలి.

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. ఒకప్పుడు ఫేమస్ డైరెక్టర్. శివ(Shiva) సినిమాతో అద్భుతం చేశారు. బాలీవుడ్‌లో కూడా అదిరిపోయే చిత్రాలు తీశారు. కానీ తరం మారుతోంది. అభిరుచులు మారుతున్నాయి. దానికి అనుగుణంగా సినిమాలు చేయలేక చతికిల పడ్డారు. ఫ్లాపుల మీద ఫ్లాఫులు వచ్చాయి. అయినా తగ్గరే. జనాలు కూడా ఆయన సినిమాలు చూడటం మానేశారు. ఇక సంచలనాలకు తెరదీశారు. రాజకీయాల నుంచి క్రైమ్‌ల వరకూ కాదేదీ వర్మ వేలు పెట్టని అంశం అన్నట్టుగా మారిపోయింది పిర్థితి.

RGV: యాంకర్‌గా మారిన వర్మ.. ఇంకెన్ని కోణాలు చూడాలో..

కానీ తర్వాత తర్వాత వర్మ సినిమాలను వ్యాఖ్యలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇక ఏం చేయాలో తెలియక మరో మెట్టు దిగారు. హాట్ బ్యూటీస్‌తో ఇంటర్వ్యూస్.. నోటికి వచ్చినట్టు మాట్లాడటం.. మొత్తానికి మరోసారి సంచలనమయ్యారు

. ఇక ఆ తర్వాత వర్మ.. అంతేలే అని జనాలంతా భావించి లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. తాజాగా ఆయన యాంకర్ అవతారమెత్తారు. నిజం అనే యూట్యూబ్ ఛానల్‌‌లో యాంకరింగ్ చేస్తున్నారు. ఇక మున్ముందు ఈయనలోని మరింకెన్ని కోణాలను మనం చూడాలో.

Google News