SSMB28: మహేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

SSMB28: మహేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్(Trivikram Srinivas) డైరెక్షన్‌లో సినిమా(SSMB28) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బ్రేక్ పడిందంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా ఏ క్షణాన ప్రారంభమైందో కానీ ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. తొలుత మ్యూజిక్ డైరెక్టర్ సమస్య, ఆ తరువాత ఫైట్ మాస్టర్లతో ఇబ్బంది.. ఇలా వరుసగా ఏవో ఒక ఇబ్బందులు వచ్చి పడుతూనే ఉన్నాయి. 

ఈ అవాంతరాలన్నింటినీ అధిగమించాక సినిమా ఏమైనా ముందుకు సాగిందా? అంటే అదీ లేదు. కేవలం 20 శాతం మాత్రమే పూర్తైందని టాక్. తాజాగా మహేష్‌(Mahesh Babu)కు త్రివిక్రమ్ షాకింగ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. మాల్‌లో షూట్ చేసిన మహేష్, హీరోయిన్ శ్రీలీల కాంబో సీన్లు మొత్తం స్క్రాప్ చేస్తున్నట్టు త్రివిక్రమ్ చెప్పారట. దీనిపై మహేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడట. ఇక మీదట పర్ఫఎక్ట్‌గా షెడ్యూల్ వేస్తేనే షూట్‌కి తాను వస్తానని లేదంటే కష్టమని త్రివిక్రమ్‌కు మహేష్(Mahesh Babu) చెప్పాడని టాక్ నడుస్తోంది. 

Mahesh Babu in SSMB 28

అయితే మహేష్(Mahesh Babu), శ్రీలీల(Sreeleela)కు సంబంధించిన ఫుటేజ్ మొత్తాన్ని స్క్రాప్ చేస్తారా. లేదంటే మాల్‌లో షూట్ చేసింది మాత్రమేనా? అనేది తెలియాల్సి ఉంది.

అయితే త్రివిక్రమ్(Trivikram Srinivas) ఇటీవలి కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్-పీపుల్స్ మీడియా సినిమా వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారని.. ఈ క్రమంలోనే మహేష్ సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. అలాగే ఎన్టీఆర్‌‌కు సంబంధించిన యాడ్స్ షూటింగ్ భారం కూడా ఆయనపైనే ఉంది. వీటిన్నింటి నేపథ్యంలో సొంత సినిమాపై దృష్టి సారించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!