Samantha Progress Report: సమంత పదో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశారా?

Samantha Progress Report: సమంత పదో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశారా?

స్టార్ హీరోయిన్ సమంత(Samantha).. చదువులో కూడా స్టారేనట. తాజాగా తన 10వ తరగతి రిపోర్ట్ కార్డ్‌(Samantha Progress Report)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వారంతా సినిమాల్లోనే కాదు… స్కూల్లో కూడా సమంత టాపరేనని అంటున్నారు. మ్యాథ్స్‌లో సామ్ వందకు 100 తెచ్చుకుంది. జియోగ్రఫీ, బయోలజీ మినహా మిగిలిన వాటన్నింటిలో 80కి పైగా స్కోర్ చేసింది. స్కూల్ టాపర్ అంటూ సమంత టీచర్ కూడా అప్రిషియేట్ చేశారు.

ఇక ఆ రిపోర్ట్ కార్డ్ చూసిన సమంత(Samantha) ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. చదువులో ఆమె నైపుణ్యానికి ఫిదా అవుతున్నారు. మొత్తానికి ప్యాన్స్ ప్రశంసలతో సోషల్ మీడియా అల్లాడుతోంది.

ఒక అభిమాని అయితే ఏకంగా విద్యార్థిగా.. నటిగా.. కూతురిగా.. భార్యగా.. కోడలిగా అన్ని అంశాల్లో సమంత టాపర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. సమంత తన నటనా నైపుణ్యాల పరంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందనే విషయంలో కూడా తన అభిమానులకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది.

Samantha Progress Report: సమంత పదో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశారా?

ఆమె తనకు మయోసైటిస్ వ్యాధి సోకిందని చెప్పడం.. ఆ సమయంలో ఆమె తన వ్యాధి కారణంగా కుంగిపోకుండా ధైర్యంగా బయటపడటం వంటి అంశాలన్నీ ఫ్యాన్స్‌కు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

సమంత నటించిన ‘శాకుంతలం’(Shaakuntalam) ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ఆమె(Samantha)కు నిరాశనే మిగిల్చింది. అయితే తన తదుపది చిత్రం ఖుషీకి సంబంధించిన సూటింగ్ శరవేగంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Google News