‘సలార్’ నటికి యాక్సిడెంట్..

'సలార్' నటికి యాక్సిడెంట్..

ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన ‘సలార్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. అయితే తాజాగా ‘సలార్’ నటికి యాక్సిడెంట్ అయింది. వైజాగ్‌లోని అనకాపల్లి వెళుతుండగా బైక్ స్కిడ్ అవడంతో ప్రమాదం జరిగింది.

ఇంతకీ ఆ నటి ఎవరంటే.. ‘సలార్’ మూవీలో ఓ సన్నివేశం బాగా హైలైట్ అయ్యింది. చిన్నపిల్లను  తన వద్దకు పంపించేందుకు గానూ.. విలన్ ఆమెను అందంగా రెడీ చేయమంటాడు. రెడీ చేసి అమ్మాయిని తీసుకొస్తున్న తరుణంలో హీరో ప్రభాస్ కోపం పట్టలేక వచ్చి ఆమెను కాపాడి విలన్‌ను చంపేస్తాడు. ఈ సీన్‌లో అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చే పాత్రలో నటించిన పూజా విశ్వేశ్వర్‌కే ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగింది.

Advertisement
'సలార్' నటికి యాక్సిడెంట్..

కళ్లద్దాలు పెట్టుకుని ఆ సీన్‌లో పూజా విశ్వేశ్వర్ బాగా హైలైట్ అవుతుంది. అయితే బైక్ యాక్సిడెంట్‌లో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా రక్తమయం అయినట్టు గా తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం పూజా విశ్వేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.