Sreeleela: శ్రీలీలకు ఆ హీరో అంటే తెగ ఇష్టమట..

Sreeleela

శ్రీలీల.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సెన్సేషన్. ఇప్పటి వరకూ అమ్మడికి భారీ హిట్ అనేది పడకపోయినా కూడా క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ముద్దుగుమ్మకు అందంతో పాటు డ్యాన్స్ ఇరగదీస్తుండటం బాగా కలిసొసిచ్చింది. అమ్మడి పేరు వింటేనే కుర్రకారు మెంటలెక్కిపోతున్నారు. అందుకేనేమో హీరోలంతా తమ సినిమాలో శ్రీలీల(Sreeleela) ఉంటే బాగుంటుందనుకుంటున్నారు. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అంతా తమ సినిమాలో శ్రీలీలనే కావాలంటున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 10 సినిమాల్లో నటిస్తోంది. త్రివిక్రమ్ – మహేష్ బాబు (Trivikram – Mahesh Babu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనూ శ్రీలీలే (Sreeleela).. అలాగే నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి (Nandamuri Balakrishna – Anil Ravipudi) కాంబోలో  తెరకెక్కుతున్న సినిమాలోనూ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు కూతురిగా శ్రీలీల (Sreeleela) నటిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Usthad Bhagat Singh) లో సైతం ఛాన్స్ కొట్టేసింది. కేవలం రెండే రెండు సినిమాలు.. పైగా అవేమీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు కూడా కావు. అయినా కూడా అమ్మడి క్రేజ్ ఆకాశాన్నంటుతోంది. 

Balakrishna

ఇక తాజాగా శ్రీలీల (Sreeleela) ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరో గురించి చెప్పమంటే బాలయ్య (Balakrishna) గురించి చెప్పడం విశేషం. తాను చిన్నప్పటి నుంచి కూడా బాలయ్య బాబుకి వీరాభిమానినని.. కొద్ది రోజుల క్రితం నుంచే ఆయనతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న మంచి పనులు, సేవా కార్యక్రమాలు చూసి బాలయ్య (Balakrishna)ను మరింతగా ఆరాధించడం మొదలు పెట్టానని శ్రీలీల చెప్పుకొచ్చింది. అమ్మడి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య అభిమానులైతే శ్రీలీల మాటలు విని పొంగిపోతున్నారు.

Google News